భీష్మ ఏకాదశి సందర్భంగా…ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తర్పణం ఇచ్చేటప్పుడు పఠించవలసిన సంకల్ప, తర్పణ, అర్ఘ్య శ్లోకాలు.

దక్షిణం వైపుకు తిరిగి

Advertisement

సంకల్పం: యావత్ భూమండల శాంత్యర్ధం, మమ వంశాభివృధ్యర్ధం, భీష్మ దేవతా ప్రీత్యర్ధం, జల తిల తర్పణం కరిష్యే!

తిల తర్పణం: ( కొన్ని నువ్వులు చేతిలోకి తీసుకుని, బ్రొటన వేలు మీదుగా నీరు వదులుతూ… మూడు మార్లు వదలాలి )

Advertisement

వైయ్యాఘ్ర పధ్య గోత్రాయా, సాంకృత్య ప్రవరాయచ
గంగా పుత్రాయ భీష్మాయా, ఆజన్మ బ్రహ్మచారిణే

జల తర్పణం: కొన్ని నీళ్ళు దోసిట్లోకి తీసుకుని, మూడు మార్లు అర్ఘ్యం వదులుతూ…

వసు నామావతారాయా, శంతనోరాత్మ జాయచ
అర్ఘ్యం దదామి భీష్మాయా, ఆబాల్య బ్రహ్మచారిణే
అపుత్రాయ దదామ్యేతత్, ఉదకం భీష్మ వర్మణే

సర్వే జనాః సుఖినోభవంతు