జంట – సమాజంలో పెళ్లి ప్రాధాన్యం

బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 91333 20425
పెళ్లి – మన సంప్రదాయ గౌరవం
పెళ్లి అయిన జంటకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. 40-50 ఏళ్ల క్రితం పెళ్లైన జంటను పల్లకీ లేదా కారులో ఊరేగించేవారు. ఆ సమయంలో ఇంట్లో పని ఉన్నా వీధిలోకి వచ్చి ఆ జంటను చూసేవారు. అది ఒక కన్నుల పండుగగా ఉండేది.
పెళ్లి – కర్తవ్యం, బాధ్యత
పెళ్లి చేసుకోవడం నేటి యువత కర్తవ్యం.
యుక్త వయసు వచ్చి స్థిరపడిన పిల్లలకు పెళ్లి చెయ్యడం తల్లిదండ్రుల బాధ్యత.
మీ తల్లిదండ్రులు జంటగా మారినందువల్లనే మీరు ఈ లోకంలో జన్మించగలిగారు.
పెళ్లి మన జీవితంలో ఒక భాగం.
మీ తాతముత్తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవించాలంటే, మీ పిల్లలకు పెళ్లి చెయ్యాలి.
ఆస్తి కంటే ప్రేమకు విలువ
పులిని చూసి భయపడినట్టు పెళ్లికి భయపడే యువతను చూస్తే జాలేస్తోంది.
జీవితం పంచుకోవడానికి ఆస్తి అవసరమా?
ఇద్దరూ కలసి ఆస్తి సంపాదించలేరా?
ఇతరుల ఆస్తి కోసం పెళ్లి అనుకోవడం సిగ్గు విషయం.
మీ శరీరం, శక్తే నిజమైన ఆస్తి.
భార్య ఇచ్చే కాఫీకి, భర్త ఇచ్చే పూలకు ప్రేమకే విలువ, దానికి ధర లేదని గుర్తించండి.
జనాభా – దేశ అభివృద్ధి కోసం
జంతువులు తమ జాతి పెంపుకోసం సంగమిస్తాయి.
మనవాళ్ల పెళ్లి, పిల్లల వల్ల మన వంశం, కులం, మతం, దేశం నిలుస్తాయి.
జనాభా లేక అభివృద్ధి లేదు.
దేశం లోకం పటంలో మాయమయ్యే ప్రమాదం ఉంటుంది.
పెళ్లి సమయానికి చేసుకోవడం ముఖ్యము
పెళ్లి సరిగ్గా వయసులో జరిగితే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.
నిస్వార్థం ఉంటే పెళ్లి జరుగుతుంది.
వాయిదా వేస్తూ ఉంటే మంచి సంబంధాలు రావు.
వివాహమే ముఖ్యమని నిర్ణయించుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి.
శుభాకాంక్షలు
మీ తెలివితేటలు, మీ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయని ఆశిస్తున్నాను.
వివాహం – మీరు సమాజానికి, దేశానికి ఇచ్చే గొప్ప బహుమతి.
ఆల్ ది బెస్ట్
శుభం