సంప్రదాయాలు

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు

blank

ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత, హిందూ సంప్రదాయంలో మహిళలు గోరింటాకు (మెహందీ / హెన్నా) పెట్టుకోవడం ఒక సాధారణ, కానీ గాఢమైన ఆచారంగా కొనసాగుతోంది. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆరోగ్య పరమైన, సాంస్కృతిక కారణాలు ఇవే:

ఎందుకంటే

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు , ఏరు దాటాల్సి వచ్చేవారు… ఈ కాలంలో కాళ్లూ , చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం , గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.

ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట , వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా , గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు పూలు , వేళ్లు , బెరడు , విత్తనాలు… అన్నీ ఔషధయుక్తాలే ! గోరింట పొడిని మందుగా తీసుకోవడం , గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! కేవలం ఆషాఢంలోనే కాదు… అట్లతద్దినాడూ , శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో , కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సంప్రదాయాలు సంస్కృతి

హిందూ యువతపై పాశ్చాత్య ప్రభావం: సాంప్రదాయ విలువలతో ఆధునిక జీవనశైలిని సమతుల్యం చేయడం

  • November 27, 2024
నేటి పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో, హిందూ యువత పాశ్చాత్య ఆలోచనల వేగవంతమైన ప్రపంచీకరణ ద్వారా రూపుదిద్దుకున్న సంక్లిష్ట సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం వృద్ధి,
blank
సంప్రదాయాలు హిందూ దేవుళ్ళు

శ్రేయస్సు కోసం వ్యాపార యజమానులు శుక్రవారం నాడు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పూజ ఎలా చేయవచ్చుః

సంపద మరియు శ్రేయస్సు యొక్క స్వరూపమైన లక్ష్మీ దేవి వ్యాపార యజమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శుక్రవారం నాడు దుకాణాలలో లేదా వాణిజ్య సంస్థలలో