10-08-2025 | ఆదివారం I రాశి ఫలితాలు

♈ మేషం ఇంటి–బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతుంది.
♈ మేషం
ఇంటి–బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అనుకూలం కావు. వృత్తి–వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.
♉ వృషభం
ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తగ్గి ఊరట కలుగుతుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహాయం లభిస్తుంది.
♊ మిధునం
అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి–ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటి–బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
♋ కర్కాటకం
స్థిరాస్తి క్రయ–విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి–ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి.
♌ సింహం
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో విందు–వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.
♍ కన్య
బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయరాదు. వృత్తి–వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
♎ తుల
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
♏ వృశ్చికం
సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు.
♐ ధనుస్సు
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి–ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి.
♑ మకరం
నూతన వ్యాపారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలలో సన్నిహితుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి–ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
♒ కుంభం
ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో మానసిక సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్ప లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
♓ మీనం
గౌరవ–మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు కార్యసిద్ధి సాధిస్తాయి. సమాజంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది.
🍁 శుభం భూయాత్ 🍀
తరచుగా అడిగే ప్రశ్నలు
10-08-2025 ఆదివారం ఆర్థికంగా ఏ రాశులకు అనుకూలంగా ఉంది?
వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి దీర్ఘకాలిక రుణభారం కొంత తగ్గుతుంది. సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి సూచించబడింది.
10-08-2025 న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ రాశులకు ఉన్నాయి?
వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం, ధనుస్సు రాశుల నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి, మీన రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది.
10-08-2025 ఆదివారం ఆరోగ్యం విషయంలో ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి?
మేష రాశి వారికి వైద్య సంప్రదింపులు అవసరం కావచ్చు. మిధున రాశి వారికి అనారోగ్య సమస్యలు, కన్య రాశి వారు ఆరోగ్యంలో అశ్రద్ధ చేయరాదు, మకర రాశి వారికి స్వల్ప అనారోగ్యం సూచించబడింది.
10-08-2025 న ఉద్యోగంలో హోదా, ప్రశంసలు ఏ రాశికి లభిస్తాయి?
కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, పనితీరుకు ప్రశంసలు అందుతాయి. మీన రాశి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
10-08-2025 ఆదివారం ఖర్చులు, వివాదాల విషయంలో ఎవరు అప్రమత్తంగా ఉండాలి?
మిధునం, కన్య రాశుల వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుంభ రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు, వృథా ఖర్చులు సూచించబడ్డాయి; తుల రాశి ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.



