మేషం ♈

  • చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.
  • వృథా ఖర్చులు పెరుగుతాయి.
  • కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.
  • వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
  • ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు.
  • నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

Advertisement

వృషభం ♉

  • వివాదాలకు సంబంధించిన విలువైన విషయాలు సేకరిస్తారు.
  • రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి.
  • గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
  • బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
  • వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
  • ఉద్యోగాలలో కొంత పురోగతి ఉంటుంది.


మిథునం ♊

Advertisement
  • ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.
  • పనుల్లో శ్రమ తప్పదు.
  • అనవసర వస్తువులపై ఖర్చు చేస్తారు.
  • కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
  • వ్యాపార ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి.
  • అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
  • ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.


కర్కాటకం ♋

  • ప్రణాళికలు క్రమపద్ధతిలో పూర్తి చేస్తారు.
  • ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
  • సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
  • విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
  • ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది.
  • నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది.


సింహం ♌

Advertisement
  • కొత్త కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతం చేస్తారు.
  • గృహ, వాహన యోగం కలుగుతుంది.
  • వ్యాపార నిర్ణయాలు లాభం తెస్తాయి.
  • విద్యార్థుల యత్నాలు సఫలం అవుతాయి.
  • సంఘంలో గౌరవం పెరుగుతుంది.
  • వ్యాపారం, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.


కన్య ♍

  • కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
  • ముఖ్యమైన పనులు మందగిస్తాయి.
  • ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉంటాయి.
  • డబ్బు నిల్వ ఉండదు.
  • కొత్త వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
  • ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.


తుల ♎

  • బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.
  • ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
  • కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు.
  • వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
  • ఉద్యోగులకు స్థాన చలనం సూచనలు ఉన్నాయి.
  • నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.


Advertisement

వృశ్చికం ♏

  • ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
  • ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.
  • సమాజంలో విలువ పెరుగుతుంది.
  • ఆలయ దర్శనాలు చేస్తారు.
  • ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
  • వ్యాపారాలు విస్తరిస్తాయి.
  • ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.


ధనస్సు ♐

  • నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి.
  • చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.
  • పాత బాకీలు వసూలవుతాయి.
  • ఇతరులకు సహాయం చేస్తారు.
  • వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
  • ఉద్యోగ వివాదాలు పరిష్కారం అవుతాయి.
  • నూతన వాహన యోగం ఉంటుంది.


మకరం ♑

  • పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
  • బంధువులతో వివాదాలు సర్దుతాయి.
  • శ్రమకు తగిన ఫలితం దక్కదు.
  • దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
  • ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
  • వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.
  • ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

Advertisement

కుంభం ♒

  • మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.
  • ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
  • స్థిరాస్తి వివాదాలలో జాగ్రత్త అవసరం.
  • కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు.
  • వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
  • ఉద్యోగాలలో ఇతరుల ఇబ్బందులు తప్పవు.


మీనం ♓

  • చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
  • ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  • చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
  • వాహన కొనుగోలు యత్నాలు వేగవంతం అవుతాయి.
  • వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
  • అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు.


🍁 శుభం భూయాత్ 🍀