09-10-2025 • గురువారం • రాశి ఫలితాలు

శ్రీ వేంకటేశాయ నమః మేషం చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నా చివరకు విజయవంతం అవుతారు.
శ్రీ వేంకటేశాయ నమః
మేషం
చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నా చివరకు విజయవంతం అవుతారు.
సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృత్తి ఉద్యోగ సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
వృషభం
సన్నిహితులతో వివాదాలు కలుగవచ్చు — మాటలలో జాగ్రత్త అవసరం.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ప్రయాణాల్లో వాహన జాగ్రత్తలు అవసరం.
ఆధ్యాత్మికతపై దృష్టి పెరుగుతుంది.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి; నిరుద్యోగులకు ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి.
మిధునం
ప్రభుత్వ లేదా ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందుతారు.
పనులు సకాలంలో పూర్తి అవుతాయి.
నూతన ఋణాలు, వస్తువులు, వాహనాల కొనుగోలు యోచనలుంటాయి.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
అవరోధాలు తొలగి వృత్తి, వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి.
కర్కాటకం
సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
స్థిరాస్తి సమస్యలు పరిష్కారమవుతాయి.
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
సింహం
కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు.
వ్యాపార నిర్ణయాలు ఆలస్యమవుతాయి.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తలెత్తుతాయి.
మిత్రులతో దైవ దర్శనాలు చేస్తారు.
ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.
కన్య
దూర బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది.
చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి.
ఋణ యత్నాలు కొంత కష్టంతో నెరవేరతాయి.
బంధు మిత్రులతో తగువులు జరగవచ్చు.
వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.
తులా
కుటుంబ పెద్దలతో ఆనందంగా గడుపుతారు.
బంధు మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలు ఉంటాయి.
భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.
అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
వృత్తి, ఉద్యోగ హోదాలు పెరుగుతాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు లభిస్తాయి.
వృశ్చికం
సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది.
దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట పొందుతారు.
అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి.
వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
ఉద్యోగ సమస్యలు అధిగమిస్తారు.
దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
ధనస్సు
సంతాన విద్య విషయంలో నిరుత్సాహం కలుగుతుంది.
ఆర్థిక వ్యవహారాలు చికాకుగా ఉంటాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
దైవ సేవ, పూజాపనులపై ఆసక్తి పెరుగుతుంది.
ఉద్యోగాల్లో అనుకోని సమస్యలు వస్తాయి — వివాదాలకు దూరంగా ఉండండి.
మకరం
ముఖ్యమైన పనులు జాప్యమవుతాయి.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
బంధువుల నుండి వచ్చిన వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.
అదనపు బాధ్యతలతో విశ్రాంతి లోపిస్తుంది.
కుంభం
గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి.
ఆత్మీయులతో చర్చలు సాఫల్యంగా సాగుతాయి.
బంధు మిత్రుల సహాయం లభిస్తుంది.
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఉద్యోగ సమస్యలు అధికారుల సహకారంతో పరిష్కరమవుతాయి.
మీనం
ఖర్చులు పెరుగుతాయి.
ఋణ ఒత్తిడి తలెత్తుతుంది.
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
పనులలో ఆటంకాలు కలుగుతాయి.
వ్యాపార అంచనాలు తక్కువగా నెరవేరుతాయి.
శుభం భూయాత్
ధర్మం రక్షతి రక్షితః




