29–11–2025, శనివారం — రాశి ఫలితాలు

మేషం ♈ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల వల్ల సమస్యలు ఎదురవుతాయి.
మేషం ♈
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. నూతన ఋణాలు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. వృథా ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదాపడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి.
వృషభం ♉
ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. ప్రతి రంగంలోనూ ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితులతో సఖ్యత బలపడుతుంది. విలువైన వస్తువులు, వాహనాల కొనుగోలు సాద్యమవుతుంది. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వేగంగా సాగుతాయి.
మిధునం ♊
వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు మరింత పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు తలెత్తుతాయి.
కర్కాటకం ♋
ఆకస్మిక ధనలాభం సూచన ఉంది. ఇంటి–బయటి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ–వృత్తుల్లో కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ పథకాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్నేహితులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సింహం ♌
ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కన్య ♍
బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక విషయంపై సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు స్తబ్ధుగా సాగుతాయి. ఉద్యోగుల్లో ఒత్తిడి పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.
తుల ♎
ఉద్యోగస్తులకు నిరుత్సాహం తలెత్తుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు నిరాశ కలిగిస్తాయి. శ్రమ ఎక్కువగా పడుతుంది. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం ♏
గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత బాగుంటుంది. లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
ధనస్సు ♐
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం విద్య–ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
మకరం ♑
ఉద్యోగస్తులకు స్థానచలనం సూచిస్తుంది. ఆదాయం తక్కువగానే ఉంటుంది. స్నేహితులతో విభేదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృథా ఖర్చులపై జాగ్రత్త అవసరం. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
కుంభం ♒
దేవాలయ దర్శనాలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. ఆకస్మిక ధనలాభం సంభవిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు వస్తాయి. పనుల్లో అనుకోని సానుకూలత ఉంటుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనం ♓
సంతానం వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. బంధువులతో విభేదాలు బాధిస్తాయి. కుటుంబ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
29-11-2025 శనివారం ఏ రాశుల వారికి ధనలాభం సూచన ఉంది?
కర్కాటకం మరియు కుంభం రాశుల వారికి ఆకస్మిక ధనలాభం సూచన ఉంది. వృశ్చికం వారికి లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి.
29-11-2025న ఉద్యోగస్తులకు ఏ రాశుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి?
వృషభం వారికి ఉన్నత హోదాలు, వృశ్చికం వారికి అధికారుల ప్రశంసలు, కుంభం వారికి శుభవార్తలు అందుతాయని సూచన. ధనస్సు వారు అదనపు బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
29-11-2025 శనివారం ఏ రాశుల వారు ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలి?
మిధునం వారికి వృథా ఖర్చులు పెరుగుతాయి. తుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మకరం వారు ఆదాయం తక్కువగా ఉండటంతో వృథా ఖర్చులపై జాగ్రత్త వహించాలి.
29-11-2025న ఏ రాశుల వారు కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండాలి?
మేషం వారికి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు, మిధునం వారికి చిన్నపాటి వివాదాలు సూచన. కన్య వారు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది, మీనం వారికి కుటుంబ ఒత్తిడులు పెరుగుతాయి.
29-11-2025 శనివారం వాహనం, స్థిరాస్తి కొనుగోలుకు ఏ రాశులకు అనుకూలం?
వృషభం వారికి విలువైన వస్తువులు, వాహనాల కొనుగోలు సాధ్యమవుతుంది. కుంభం వారికి నూతన వాహనయోగం ఉంది. వృశ్చికం వారి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు



