🔱 రాహు–కేతు దశా రహస్యాలు 🔱

జ్యోతిషశాస్త్రంలో రాహు, కేతు దశల విశిష్టత

జ్యోతిషశాస్త్రములో అత్యంత క్లిష్టమైన మరియు గంభీరమైన దశలుగా రాహు, కేతు దశలు పరిగణించబడినవి. సూర్యుడు, చంద్రుడు, గురువు వంటి గ్రహాల ఫలితాలను నిర్ణయించుట కొంత సులభమైనప్పటికీ, రాహు–కేతువుల ఫలితాలను నిర్ణయించుటకు ప్రత్యేక నియమములు అవసరమవుతాయి. అందువల్ల పరాశర మహర్షి వీరి ఫలిత నిర్ణయానికి విశేషమైన విధానాన్ని బోధించారు.

ఇవి కూడా చదవండి: 22 జూన్ 2026 దృగ్గణిత పంచాంగం | సోమవారం తెలుగు పంచాంగం · దత్తపుత్ర యోగాలు (సంతానభంగ యోగాలు) – పరాశర జ్యోతిష శాస్త్రం ప్రకారం పూర్తి వివరాలు · దశాఫల రహస్యాలు భాగం 3 | గ్రహ దశలు ఎప్పుడు సంపూర్ణ ఫలితాలు ఇస్తాయి?


రాహు, కేతువుల స్వభావం

రాహువు, కేతువు స్వయంగా స్థూల శరీరము లేని ఛాయాగ్రహములు. అందుచేత వీరు తాము ఉన్న రాశి అధిపతి, తాము ఉన్న భావము, తాము యుతి పొందిన గ్రహము, తాము పొందిన దృష్టి ఆధారంగా ఫలితములను ప్రసాదించుదురు.

Advertisement

పరాశర సిద్ధాంతంలో రాహు–కేతువుల ఫలిత నిర్ణయం

పరాశర సిద్ధాంతంలో ఒక ప్రధాన నియమము ఏమిటంటే రాహు, కేతువులు తమతో సంయోగము కలిగిన గ్రహ ఫలితములను ముందుగా ఇస్తారు. సంయోగము లేకపోతే తాము ఉన్న రాశి అధిపతి ఫలితములను ఇస్తారు. అది కూడా బలహీనమైతే తమపై దృష్టి కలిగిన గ్రహ ఫలితములను ఇస్తారు.

రాహువు భౌతిక ప్రపంచ విస్తరణకు కారకుడు. విదేశీ సంబంధములు, అనూహ్య లాభములు, రాజకీయ ప్రభావము, జనాకర్షణ, ఆధునిక సాంకేతిక విద్య, అసాధారణ మార్గముల ద్వారా అభివృద్ధి రాహు ప్రభావములో కనిపించును.


కేతు దశ యొక్క ప్రభావం

కేతువు విరక్తి, మోక్షము, మంత్రసిద్ధి, తపస్సు, గూఢవిద్యలు, ఆధ్యాత్మిక అనుభవములు, అంతర్ముఖ జీవనానికి కారకుడు. కేతు దశలో చాలామంది జీవిత లక్ష్యమును పునఃపరిశీలించుట ప్రారంభిస్తారు.


రాహు దశలో శుభాశుభ ఫలితాలు

రాహువు కేంద్ర లేదా త్రికోణ స్థానములలో ఉండి యోగకారక గ్రహ సంబంధము కలిగినచో ఆశ్చర్యకరమైన అభివృద్ధి కలుగజేయగలడు. సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తిని ఉన్నత స్థితికి చేర్చగల శక్తి రాహువునకు ఉన్నది. అయితే రాహువు పాపపీడితుడై షష్ట, అష్టమ, ద్వాదశ సంబంధములు కలిగినచో మానసిక ఆందోళనలు, న్యాయవ్యవహారములు, మోసములు, అపకీర్తి, అనిశ్చిత పరిస్థితులు కలుగవచ్చును.

Advertisement

కేతు దశలో శుభాశుభ ఫలితాలు

కేతువు శుభస్థితిలో ఉన్నచో ఆధ్యాత్మిక అభివృద్ధి, మంత్రసిద్ధి, గురుకటాక్షము, గూఢజ్ఞానము ప్రసాదించును. కేతువు బలహీనమైతే ఒంటరితనము, వియోగము, అనూహ్య నష్టములు, అసంతృప్తి కలుగవచ్చును.

రాహు మహాదశలో కేతు అంతర్దశ, కేతు మహాదశలో రాహు అంతర్దశ సాధారణముగా జీవితములో ఒక కీలక మలుపును కలిగించును. పాత జీవిత విధానము ముగిసి కొత్త మార్గము ప్రారంభమగుట తరచుగా కనిపించును.


రాహు–కేతు దశలను పరిశీలించవలసిన విధానం

పరాశర సంప్రదాయంలో రాహు,కేతు దశలను పరిశీలించునప్పుడు ఈ క్రమము అనుసరించవలెను. రాహు/కేతు స్థానం, రాశ్యాధిపతి బలం, యుతి గ్రహములు, దృష్టులు నవాంశ స్థితి, దశా-అంతర్దశ, గోచార గురు, శని. ఈ నియమములను పాటించకుండా కేవలం రాహు దశ లేదా కేతు దశ అని మాత్రమే ఫలితములు చెప్పుట శాస్త్రసమ్మతము కాదు.


ముగింపు

రాహువు ప్రపంచమును చూపించును. కేతువు పరమార్థమును చూపించును. రాహువు బాహ్య విజయమునకు దారి తీస్తే, కేతువు అంతర్గత జ్ఞానమునకు దారి తీస్తాడు. అందువల్ల ఈ రెండు దశలు జీవితములో అత్యంత పరివర్తనాత్మక కాలములుగా పరిగణించబడతాయి...

Advertisement

మరిన్ని జ్యోతిష విషయాలకు సంప్రదించండి:

చింతా గోపిశర్మ సిద్ధాంతి
పెద్దాపురం – 533437
సెల్ : 9866193557
ఫోన్ : 098661 93557

తరచుగా అడిగే ప్రశ్నలు

పరాశర సిద్ధాంతం ప్రకారం రాహు కేతువులు ఏ గ్రహ ఫలితాలను ఇస్తారు?

రాహు, కేతువులు ముందుగా తమతో సంయోగం కలిగిన గ్రహ ఫలితాలను ఇస్తారు. సంయోగం లేకపోతే తాము ఉన్న రాశి అధిపతి ఫలితాలను, అది కూడా బలహీనమైతే తమపై దృష్టి కలిగిన గ్రహ ఫలితాలను ఇస్తారు.

రాహు దశలో ఎలాంటి ఫలితాలు కలుగవచ్చు?

రాహువు కేంద్ర లేదా త్రికోణ స్థానాల్లో ఉండి యోగకారక గ్రహ సంబంధం కలిగితే అభివృద్ధి కలుగవచ్చు. పాపపీడితుడై షష్ట, అష్టమ, ద్వాదశ సంబంధాలు ఉంటే మానసిక ఆందోళనలు, న్యాయవ్యవహారాలు, అపకీర్తి కలుగవచ్చు.

కేతు దశలో శుభాశుభ ఫలితాలు ఏమిటి?

కేతువు శుభస్థితిలో ఉంటే ఆధ్యాత్మిక అభివృద్ధి, మంత్రసిద్ధి, గురుకటాక్షం, గూఢజ్ఞానం సూచించబడతాయి. బలహీనమైతే ఒంటరితనం, వియోగం, అనూహ్య నష్టాలు, అసంతృప్తి కలుగవచ్చు.

రాహు మహాదశలో కేతు అంతర్దశ ప్రభావం ఎలా ఉంటుంది?

రాహు మహాదశలో కేతు అంతర్దశ, కేతు మహాదశలో రాహు అంతర్దశ సాధారణంగా జీవితంలో కీలక మలుపును సూచిస్తాయి. పాత జీవిత విధానం ముగిసి కొత్త మార్గం ప్రారంభమవడం తరచుగా కనిపిస్తుంది.

రాహు కేతు దశలను ఏ క్రమంలో పరిశీలించాలి?

రాహు/కేతు స్థానం, రాశ్యాధిపతి బలం, యుతి గ్రహాలు, దృష్టులు, నవాంశ స్థితి, దశా-అంతర్దశ, గోచార గురు, శని అనే క్రమంలో పరిశీలించాలి. కేవలం రాహు దశ లేదా కేతు దశ అని మాత్రమే ఫలితం చెప్పడం శాస్త్రసమ్మతం కాదు.

రాహు కేతువులను ఛాయాగ్రహాలు అని ఎందుకు అంటారు?

రాహువు, కేతువులకు స్వయంగా స్థూల శరీరం లేదు. అందుకే వారు ఉన్న రాశి అధిపతి, భావం, యుతి పొందిన గ్రహం, పొందిన దృష్టి ఆధారంగా ఫలితాలు ఇస్తారు.