రాశిఫలాలు 24-06-2026 – బుధవారం అన్ని రాశుల ఫలితాలు
🌹━━❀ ☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ ❀━━🌹వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792 24-06-2026 / బుధవారం / రాశిఫలాలు ❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀ మేషం చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి.
🌹━━❀ ☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ ❀━━🌹
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
24-06-2026 / బుధవారం / రాశిఫలాలు
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
మేషం
చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గీయులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృషభం
ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది.
మిధునం
ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు కలసిరావు.
కర్కాటకం
ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.
సింహం
వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
కన్య
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరమైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల
ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.
వృశ్చికం
సంతాన విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు
ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.
మకరం
గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మీనం
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
సర్వేజనాః సుఖినోభవంతు | సమస్త సన్మంగళాని భవంతు
╚══❀🍁🕉️🌿❀══╝🌻╚══❀🕉️🍁🌿❀══╝
తరచుగా అడిగే ప్రశ్నలు
24-06-2026 బుధవారం మేష రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి?
మేష రాశి వారికి పనులు అంతంత మాత్రంగా సాగుతాయని, సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయని, దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని సూచించారు.
24-06-2026న ఏ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక పరంగా అనుకూలం?
వృషభం (ఆదాయం బాగుంటుంది, నూతన వాహన యోగం), కర్కాటకం (నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగంలో హోదాలు), వృశ్చికం, మకరం రాశుల వారికి అనుకూల ఫలితాలు సూచించారు.
24-06-2026న ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు?
మిధునం (ఆదాయానికి మించిన ఖర్చులు), సింహం (పనులలో జాప్యం), ధనస్సు (ఆరోగ్య సమస్యలు, చికాకులు), మీనం (దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు) రాశుల వారికి జాగ్రత్త సూచించారు.
24-06-2026 బుధవారం ప్రయాణాల గురించి ఏ రాశులకు సూచనలు ఉన్నాయి?
మేష రాశి వారు దూర ప్రయాణాలు, మీన రాశి వారు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని సూచించారు. మకర రాశి వారికి దూర ప్రయాణ సూచనలు, తుల రాశి వారికి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉన్నాయి.
24-06-2026న తుల, కన్య, కుంభ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి?
తుల రాశి వారికి ఉద్యోగాలలో నూతన అవకాశాలు, పాత ఋణాలు తీర్చే అవకాశం. కన్య రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభ రాశి వారికి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు




