మన ఆరోగ్యం మన ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది – ఇది ముమ్మాటికీ వంద శాతం నిజం.

ఆహార నియమాలు:

Advertisement
  • నాలుకకు రుచి తెలుసు, కానీ ఆరోగ్యాన్ని కాపాడటం తెలియదు.
  • బాగా రుచిగా ఉందని అతిగా తినడం వల్ల శరీరానికి ఇబ్బందులు కలుగుతాయి.
  • మసాలా పదార్థాలు, ఎక్కువ నూనె, అధిక ఉప్పు తక్కువగా వాడండి.
  • తేలికపాటి, శక్తినిచ్చే ఆహారాన్ని బాగా నమిలి, ప్రశాంతంగా తినండి.
  • ఆరోగ్యకరమైన పదార్థాలు:
    • ఉల్లి, వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి, ఏలకులు, లవంగాలు.
    • డ్రై ఫ్రూట్స్, నిమ్మ, ఆపిల్, జామ, అరటి, సీజనల్ ఫ్రూట్స్ (షుగర్ లేకుంటే మితంగా తీసుకోండి).

శారీరక ఆరోగ్యం:

  • వ్యాయామం తప్పనిసరి.
  • ఆవేశం, ఆతృత, కోపం – ఇవన్నీ మీకే నష్టం.
  • ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అలవాటు చేసుకోండి.
  • కనీసం 6-8 గంటలు నిద్ర అవసరం.

తప్పక పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు:

  • ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్, మైదా పదార్థాలు, అధిక తీపి తగ్గించుకోండి.
  • హోటల్ ఆహారానికి అలవాటు పడకండి.
  • అనారోగ్యం పాలై కుటుంబాన్ని, సమాజాన్ని కష్ట పెట్టకుండా, ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Advertisement

ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!

✍️ బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 91333 20425