ఆదర్శ జీవితం అనే అక్షరంగా వెలసిన శ్రీరాముడు

రాజు అంటే అధికారం కాదు… ప్రజల బాధలో పాల్గొని వారిని కుటుంబ సభ్యుల్లా చూడగల మహోన్నతుడు.
దశరధ తనయుడు శ్రీరాముడు, పాలకుడిగా ప్రజలకో మిత్రుడిగా, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా వ్యవహరించడమే కాక, కుటుంబంలో యజమానిగా తన ప్రజలకు ఏ లోటూ లేకుండా చూసే పూజ్య వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు.
చెడుకు బానిస కాకుండా, జీవితాన్ని నియమశీలంగా, నియంత్రితంగా గడపాలని మనకు నిర్దేశించిన ఆదర్శమూర్తి రామచంద్రుడు, ధర్మాన్ని తన జీవిత ముద్రగా మార్చుకున్న యుగపురుషుడు.
సోదరుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, వాత్సల్యాన్ని రామాయణంలో చూపిన విధానం –
వివాదాలకు తావు లేకుండా బంధాలను బలపరచాలన్న సందేశాన్ని మనకు చెప్తుంది.
ఇది భ్రాతృభావానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
నేటి యువతరం –
వివాహానికి భయపడే వారు, లేదా దాన్ని తేలికగా తీసుకునే వారు –
తమ సంసారాన్ని కొట్లాటలతో నరకంగా మార్చుకుంటున్న ఈ రోజుల్లో,
రాముడు – సీతమ్మ వారితో కలిసి జీవించిన ఆదర్శ కుటుంబ జీవితం
మనకు ఒక దిశానిర్దేశం.
వివాహం అనేది భగవంతుడు ఏర్పరచిన పవిత్ర బంధమని, దానికి జీవితాంతం కట్టుబడి ఉండే శక్తిని
శ్రీరాముడు తన జీవితంతో చూపించాడు.
అందుకే ఆయన మానవజాతికి మార్గదర్శకుడు, పూజ్యుడు, భగవంతుడు!
