ఆచరణీయ ధర్మశాస్త్రమనునది, వేదములో నుండి సులభముగ అర్ధం కావాలని పెద్దలు, ధర్మసింధు, నిర్ణయసింధు, అను పేర్లతోను ; మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు పేర్లతోను వ్రాశారు.

వాటిలో కూడ … ఋషులు చెప్పిన వాటినే వ్రాశారు. ఈ స్మృతులు, సింధువులు మొదలగునవి ధర్మనిబంధన గ్రంథములు. మానవుని ఆరోగ్యమును దృష్టిలో ఉంచుకొని ఈ శాస్త్రములు - వ్రాయబడినవి. (రోగములే పాపములు) ధర్మశాస్త్రము అంటేనే గొప్ప "ఆరోగ్యశాస్త్రము” అనాలి.

ఇవి కూడా చదవండి: ధర్మ సందేహాలు – హిందూ ధర్మ రహస్యాలు & నియమాలు 🔔 · శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా? వేదాలు వింటే చెవులలో సీసం పోశారా? – వాస్తవాలు మరియు … · అన్నదానం, వస్త్రదానం: మోక్ష మార్గంలో అడుగు మొదటి దశ

పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణబాధతే! అని చెప్పుచునే వున్నాము. మానవుడు ఆరోగ్యముగ వున్నపుడే సదాచారాలు చేయగల్గుతాడు. రోగములు రాకుండా నిరోధించునవే ఆచారములు, మంత్రతంత్రములు. వీటి ప్రభావముతో మానవుని మనస్సు శుచియై నిగ్రహమును కలిగిస్తూ వున్నది.

Advertisement

పూర్వము “ధర్మప్రజా సంపత్త్యర్ధం స్త్రియముద్వహేత్||" అనే భావముతో వివాహము చేసుకొనెడివారు. పిల్లలు ఆరోగ్యవంతులుగాను ధర్మాచరణులుగాను వుండేలాగున పుట్టేవారు. ధర్మము వలన దేశము సుభిక్షముగా వుండేది. ప్రకృతములో మనము ధర్మలోపము చేయుట వలన మన పిల్లలే మనకు అడ్డం తిరుగుతున్నారు. మన సాంప్రదాయమునకు విరుద్ధముగ తయారైనారు. ఈ విధముగా జరగడంలో ప్రయోగలోపమే ప్రధాన కారణము.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఆచరణీయ ధర్మశాస్త్రాన్ని ఏ గ్రంథాల రూపంలో వ్రాశారు?

వేదాలలోని విషయాలు సులభంగా అర్థం కావాలని పెద్దలు ధర్మసింధు, నిర్ణయసింధు అనే పేర్లతోను, మనుస్మృతి, పరాశరస్మృతి మొదలైన పేర్లతోను వ్రాశారు. వీటిలో ఋషులు చెప్పిన విషయాలనే పొందుపరిచారు.

ధర్మనిబంధన గ్రంథాలు అంటే ఏవి?

స్మృతులు, సింధువులు మొదలైనవి ధర్మనిబంధన గ్రంథాలు. ఇవి మానవుని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాయబడినవి కాబట్టి ధర్మశాస్త్రాన్ని గొప్ప "ఆరోగ్యశాస్త్రం" అని కూడా అంటారు.

ధర్మశాస్త్రంలో ఆరోగ్యానికి, సదాచారాలకు సంబంధం ఏమిటి?

మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సదాచారాలు చేయగలుగుతాడని ధర్మశాస్త్రం చెబుతుంది. ఆచారాలు, మంత్రతంత్రాల ప్రభావంతో మనస్సు శుచియై నిగ్రహం కలుగుతుందని పెద్దల నమ్మకం.

పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణబాధతే అనే వాక్యం భావం ఏమిటి?

ప్రచారంలో ఉన్నట్లుగా, పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో బాధిస్తుందని ఈ వాక్యం భావం. అందుకే ధర్మశాస్త్రంలో రోగములనే పాపములుగా పేర్కొన్నారు.

పూర్వం వివాహాన్ని ఏ భావంతో చేసుకునేవారు?

పూర్వం "ధర్మప్రజా సంపత్త్యర్ధం స్త్రియముద్వహేత్" అనే భావంతో వివాహం చేసుకునేవారు. ధర్మం వల్ల దేశం సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుతం ధర్మలోపానికి ప్రయోగలోపమే ప్రధాన కారణమని ధర్మశాస్త్ర పెద్దలు చెబుతారు.