homebanner

హిందూ సంస్కారాలు మరియు షోడశ సంస్కారాల ప్రాముఖ్యత | Jagadguru Vani

హిందూ సంస్కారాలు మరియు షోడశ సంస్కారాల ప్రాముఖ్యత | Jagadguru Vani

🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻

👉 శాస్త్రాలు – పురాణాలు

 హిందూ సంస్కారాలు

సంస్కారాలు ఒక వస్తువును శుద్ధిచేయు కర్మలు. శుద్ధికర్మల వలన ఫలితం రెండువిధాలుగా ఉంటుంది. వస్తువులో నూతన గుణాన్ని, కలిగించటం మొదటి ఫలితం. దోషములను తొలగించటం రెండవ ప్రయోజనం. ఈ రెండింటినీ దృష్టా దృష్టీ ప్రయోజనాలు అని కూడా చెప్పవచ్చు.

ఒక పాత్రను పరిశుభ్రంగా తోమి, కడిగి పెట్టామనుకోండి. అప్పుడు దానికుండే కల్మషం పోతుంది. అది తెల్లగా, స్వచ్ఛంగా మెరుస్తుంటుంది. ఇది కనపడే ప్రభావం.

మంత్రపూతమైన ఉదకంచే ఒక వస్తువును ప్రోక్షణ చేసినప్పుడు కలిగే ప్రభావం మన కళ్ళకు గోచరించనిది.

మానవ శరీరాన్ని శుద్ధి చేయగలిగిన కొన్ని సంస్కారాలను ధర్మశాస్త్రాలు మనకు సూచించాయి. అవి ముఖ్యంగా పదహారు. వాటినే షోడశ సంస్కారాలని పిలుస్తారు. ఈ సంస్కారాలను జరపటం ద్వారా వ్యక్తిపై దృశ్యాదృశ్య ప్రభావాలు పడ్తాయి.

అందువలన అవి అత్యంతావశ్యకమైనవి. ధర్మశాస్త్రాలలో నమ్మకమున్న వారందరికీ ఈ సంస్కారాల ఆచరణ అత్యంతావశ్యకం. దాని ద్వారా సత్ఫలితం లభిస్తుంది.

శాస్త్రాలు నిర్దేశించిన ప్రతి కార్యము ధర్మం అయితే, నిషేధించబడినది అధర్మం. వేదం సమస్త ధర్మానికి పునాది. వేదమునకు మరియు ఆచారమునకు అనుగుణంగా ఉన్న స్మృతి వాక్యము కూడా ప్రమాణము. వీటన్నిటితో పాటు మన మనస్సాక్షి యొక్క తృప్తి కూడా మనకు ఉన్నది. ఏది ధర్మం, ఏది అధర్మం అని నిర్ణయించడానికి ఇవి మనకు సహాయపడతాయి. అసౌకర్యం, అవసరం ఎంత పెద్దదైనా మనసును అధర్మం వైపు మళ్లించకూడదు. ఎంతో కృషితో ధర్మాన్ని పాటించాలి, ఎందుకంటే అది మనకు త్వరలో లేదా తరువాత ప్రయోజనాలను ఇస్తుంది. ఒకరు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పడేసి బంధువులు వెళ్లిపోతారు. ధర్మం, అధర్మం మాత్రమే అతనికి తోడుగా ఉంటాయి.

ప్రతి సంస్కారానికీ, దానిని ఆచరించటానికి ఒక సమయం ఉంటుంది. అలా ఉచిత సమయంలో ఆచరించిన సంస్కారం మరింతటి సత్ఫలితాన్ని ఇస్తుంది. శాస్త్రాలలో విహితకాలంలో సంస్కారం ఆచరించలేకపోతే, ఆ తరువాత సంస్కారాన్ని ఆచరించతగ్గ గౌణకాలం చెప్పబడింది.

అందరూ ధర్మశాస్త్రాలను గౌరవించి అవి విధించిన సంస్కార కర్మల నాచరించి వాటి నుండి సత్ఫలితాలను పొందుదురు గాక!

శారదే పాహిమాం శంకర రక్షమాం

🌹జగద్గురు వాణి అను పుస్తకము నుండి 🌹

🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ