సృష్టి స్థితి లయకారకుడు!

శివుడు, ఈశ్వరుడు, శంకరుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు - ఇలా ఎన్నో నామాలతో పూజలందుకునే సదాశివుడు పంచముఖుడు.

Advertisement

ఆయన ఐదు ముఖాలు – ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు – పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమికి ప్రతీకలు.

ప్రతి ముఖం సృష్టిలోని ఒక్కో కోణాన్ని, శివుని విశేష రూపాన్ని సూచిస్తుంది.

Advertisement

ఈశానుడు ఆకాశాన్ని, తత్పురుషుడు వాయువును, అఘోరుడు అగ్నిని, వామదేవుడు జలాన్ని, సద్యోజాతుడు భూమిని శాసిస్తారు.

పంచముఖ శివుని అనుగ్రహంతో సమస్త లోకాలకు శుభం కలుగుగాక.