సమాచారం మరియు సేకరణ
ఆడపిల్లల కోసం సూచనలు

బాలికలనుండి 55 సంవత్సరాల ఆడవారందరికి మీరు బయటకు వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని సూచనలు: బయటకు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి – బేలగా ఉండకండి, ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండండి.
బాలికలనుండి 55 సంవత్సరాల ఆడవారందరికి మీరు బయటకు వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని సూచనలు:
- బయటకు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి – బేలగా ఉండకండి, ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండండి.
- మీ రక్షణ కోసం సాధనాలు నేర్చుకోండి – వీలైతే కరాటే, జూడో లాంటి ఆటలు నేర్చుకోండి. కనీసం వారానికి ఐదు సార్లు వాకింగ్ చేయండి, వీలైతే జిమ్‌కు వెళ్ళండి, సూర్యనమస్కారాలు చేయండి.
- రక్షణకోసం అవసరమైన వస్తువులు కలిగి ఉంచండి – మీ హ్యాండ్ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే, చిన్న కారం పొట్లం ఉంచుకోండి.
- రక్షణ సంబంధిత నంబర్లు మీ మొబైల్‌లో ఫీడ్ చేసుకోండి – ముఖ్యమైన రక్షణ సంఖ్యలను స్పీడ్ డైల్‌లో ఉంచండి.
- సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి – సమస్య వచ్చినప్పుడు బలంగా, తెలివిగా ఆలోచించండి. నిజంగా చెప్పాలంటే, మనం మన లాగించి వెళ్ళకూడదు.
- మీ రక్షణ కోసం ఇతర వస్తువులను ఉపయోగించండి – మీరు గోళ్ళు పెంచుతుంటే, వాటితో, హెయిర్ పిన్స్ లేదా గాజులు బద్దలుగా గాయపరచండి.
- సిగ్గు పడకుండా గట్టిగా అరవండి – బలం తెచ్చుకుని పరిగేత్తండి, ఇతరులను అవగాహన చేయండి.
- పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి – ధైర్యంగా, ఉత్సాహంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి.
- ఆధారాలు సేకరించండి – ఆధారాలు సేకరించడంలో మీకు సహాయం చేయే వ్యక్తులు ఉండవచ్చు.
- కేబ్ లేదా ఆటో ఎక్కినప్పుడు నెంబర్ చెప్పండి – డ్రైవర్ వినేటట్లు ఇంట్లో వారితో మాట్లాడి వాహనం నెంబర్ చెప్పండి.
Advertisement
మీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
బి. మల్లిఖార్జున దీక్షిత్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 91333 20425




