(భారతదేశంలో కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు)

📅 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం

Advertisement

హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
భారతదేశ సమయం ప్రకారం:

  • ప్రారంభం: ఉదయం 9:27 AM
  • సంపూర్ణ చంద్రగ్రహణం: ఉదయం 11:56 AM

📌 హోలీ పండుగ & చంద్రగ్రహణ ప్రభావం

🙋‍♀️ చాలామంది హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ప్రభావం గురించి ఆలోచిస్తుంటారు.
❌ అయితే, ఈ గ్రహణం పగటి సమయంలో కావడంతో, భారతదేశంపై ఏ ప్రభావం ఉండదు.
✅ ఫెస్టివల్ జరుపుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవు.

Advertisement

గ్రహణం కనిపించే దేశాలు

ఈ చంద్రగ్రహణం పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర & దక్షిణ అమెరికా దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా:

  • అమెరికా, మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, క్యూబా, జమైకా, వెనిజులా, పెరు మరియు ఇతర దేశాలు.
    (మన భారతీయులు నివసించే ప్రాంతాలు కావడంతో, వీటిని ప్రస్తావించడం జరిగింది.)

గ్రహణ నియమాలు – భారతదేశంలో వర్తించవు

భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు, కాబట్టి:

  • గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు.
  • దేవాలయాల శుద్ధి, పట్టు విడుపు స్నానాలు అవసరం లేదు.
  • హోలికా దహనం (మార్చి 13), హోలీ ఉత్సవం (మార్చి 14) పూర్తి ఉత్సాహంగా జరుపుకోవచ్చు.

🙏🌹 ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ