మూఢత్వం ప్రచారం చేసేవాళ్లు ఎవరైనా, వారు తీవ్రవాదులకన్నా తక్కువకారు.

నిన్న సాయంత్రం మా ఎదురింట తండ్రి–కొడుకు మధ్య పెద్ద గొడవ జరిగింది.
నిన్న సాయంత్రం మా ఎదురింట తండ్రి–కొడుకు మధ్య పెద్ద గొడవ జరిగింది.
అది కూడా పనికిరాని విషయంపైనే!
కొడుకు గడ్డం తీయగానే, అద్దం మంచం మీద పెట్టాడట.
తండ్రి కోపంతో,
“బుద్ధుందా? గడ్డి తింటున్నావా? అద్దం మంచం మీద పెడితే ఐశ్వర్యం పోతుంది” అన్నాడు.
కొడుకు ప్రశ్నించాడు:
“నాన్నగారూ, అద్దం మంచం మీద పెడితే ఐశ్వర్యం పోవడానికి లింక్ ఏమిటండి?”
మాటామాటా పెరిగి, చివరికి కోపంతో తండ్రే అద్దం పగలగొట్టేశాడు.
ఆ ఇంటావిడ “అయ్యయ్యో!” అంటూ కుప్పకూలిపోయింది.
తండ్రి భయంతో అడిగాడు:
“ఏమైందే?”
ఆవిడ సమాధానం:
“అద్దం ఎవరి చేతిలో పగిలితే వారికి పదేళ్ల పాటు శనిపడుతుందిట!
అదే యూట్యూబ్‌లో ఆ గడ్డం చెప్పాడు.”
అది విన్న ఆయనకే గుండె బరువైపోయింది.
ఇంతలో పక్కింటాయన వచ్చి మరో జోడించాడు:
“భయపడొద్దండి, ముందు ఆ అద్దం ముక్కలు లెక్కపెట్టండి.
సరి సంఖ్య ఉంటే మూడు నెలలు దోషం,
బేసి సంఖ్య ఉంటే నాలుగు నెలలు దోషం!”
అంతలోనే ఎనభై ఏళ్ల వయసున్న తల్లి వచ్చి,
“ఏమిటో ఈ వెధవ చాదస్తాలు! మాకాలంలో ఇవేవి లేవు.
అద్దం ముక్కలు ఏరేసి అవతల పారేయండి.
లేకపోతే అందరికీ ప్రమాదం, గుచ్చుకుని సెప్టిక్ అవుతుంది,”
అని చీపురు పట్టుకొని ముక్కలు ఊడ్చేసింది.
గమనిక




