ప్రతి అమ్మాయిలోనే అమ్మ అనే పదం దాగి ఉంది. ఇది కేవలం భాషా పరంగా కాకుండా, ఆమె జీవితంలోని తప్పనిసరి మార్పులను సూచిస్తుంది. వివాహం ఒక అమ్మాయిని అమ్మగా మార్చే ఒక ప్రక్రియ. చదువు, ఉద్యోగం లాగే వివాహం కూడా ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం.

వివాహం చేసుకున్న స్త్రీకి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. తన భర్త తనను రక్షించుకుంటూ, అతని ప్రేమతో ఆమె ఒక కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ ఆమెను మాతృత్వం వైపు నడిపిస్తుంది, ఇది ప్రకృతి ధర్మాల ఒక భాగం.

భర్తను కేవలం రక్షకుడిగా కాకుండా, ఒక మంచి స్నేహితుడుగా చూడాలి. ఆయన స్త్రీని శృంగార జీవితంలో ఆమెను మాతృమూర్తిగా మార్చడానికి సహాయపడతాడు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర అవగాహన, అనురాగం ఉన్న చోటు వారిద్దరూ కలిసి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించగలరు.

అమ్మతనం అనేది ఒక మహిళకు లభించే అపురూపమైన బహుమతి. ఈ బహుమతిని వివాహం ద్వారా మాత్రమే పొందవచ్చు. పెళ్ళి అనేది కేవలం రెండు మనసుల కలయిక కాకుండా, రెండు ఆత్మల ఐక్యత కూడా. మరియు అమ్మాయి తల్లిగా మారినప్పుడు సమాజంలో ఆమెకు కొత్త గౌరవం కలుగుతుంది.

ఈ వివాహ వ్యవస్థ ద్వారా ఒక మహిళ తన జీవితంలో చివరి వరకు తనకు తోడునీడగా ఉండగల భర్తను పొందుతుంది. అనుభవజ్ఞులైన తల్లితండ్రులు ఈ వివాహానికి ముందడుగు వేసి, మీ పిల్లల వివాహానికి తగిన సమయంలో సహాయం చేయండి.

బి మల్లికార్జున దీక్

తరచుగా అడిగే ప్రశ్నలు

'ప్రతి అమ్మాయిలో అమ్మ దాగుంది' అంటే అర్థం ఏమిటి?

'అమ్మాయి' అనే పదంలోనే 'అమ్మ' దాగి ఉంది. ఇది కేవలం భాషాపరమైనది కాదు, ఆమె జీవితంలో జరిగే తప్పనిసరి మార్పులను సూచిస్తుంది; వివాహం అమ్మాయిని అమ్మగా మార్చే ప్రక్రియ.

స్త్రీ జీవితంలో వివాహానికి ఎందుకు ప్రాముఖ్యత ఉంది?

చదువు, ఉద్యోగం లాగే వివాహం కూడా ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. వివాహం ద్వారా స్త్రీకి సమాజంలో గౌరవం మరియు జీవితాంతం తోడునీడగా ఉండే భర్త లభిస్తారు.

భార్య భర్తను ఎలా చూడాలి?

భర్తను కేవలం రక్షకుడిగా కాకుండా ఒక మంచి స్నేహితుడిగా చూడాలి. పరస్పర అవగాహన, అనురాగం ఉన్నచోట దంపతులు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించగలరు.

పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయికేనా?

కాదు, పెళ్లి రెండు మనసుల కలయికే కాకుండా రెండు ఆత్మల ఐక్యత కూడా. అమ్మాయి తల్లిగా మారినప్పుడు సమాజంలో ఆమెకు కొత్త గౌరవం కలుగుతుంది.

పిల్లల వివాహంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి?

అనుభవజ్ఞులైన తల్లిదండ్రులు ముందడుగు వేసి, తమ పిల్లల వివాహానికి తగిన సమయంలో సహాయం చేయాలి.