భోజనం - సదాచార నియమాలు

భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్లు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్లను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
- భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్లు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్లను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
- తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
- ఆహార పదార్థాలను (కూర, పప్పు, పచ్చళ్ళు) తినే పళ్ళానికి తాకించరాదు. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
- అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు.
- భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
- ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు.
- ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
- విరిగిన, సొట్టలు ఉన్న కంచం భోజనానికి పనికిరాదు.
- నిలబడి అన్నం తినడం దరిద్రతకు దారి తీస్తుంది.
- ఉపనయనం చేసినవారు ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకోవాలి.
- భోజన సమయంలో వంట బాగాలేదని దూషించకూడదు.
- ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోవద్దు.
- కంచం ఒడిలో పెట్టుకుని, మంచం మీద భోజనం చేయరాదు (అనారోగ్యులు మినహా).
- మాడిన అన్నాన్ని నివేదించరాదు, అతిథులకు పెట్టరాదు.
- భోజనం అయ్యాక వెంట్రుకలు కత్తిరించకూడదు.
- గురువులు, మహాత్ములు ఇంటికి వస్తే మిగిలిన భోజనం పెట్టరాదు.
- వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు.
- భోజనంలో వెంట్రుకలు, పురుగులు వస్తే వెంటనే విడిచిపెట్టాలి.
- భోజనం అయ్యాక విస్తరిలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
- భగవన్నామ స్మరణ చేస్తూ వంట వండడం, భోజనం చేయడం శ్రేష్ఠం.
- ఉపాసకులను, దీక్షలో ఉన్నవారిని బలవంతంగా ఎక్కువ తినమని చెప్పకూడదు.
- భోజనం చేస్తున్నప్పుడు వేదం చదువరాదు.
- గిన్నె పూర్తిగా ఊడ్చుకుని తినరాదు.
- భోజన సమయంలో నీటిపాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
- స్త్రీలు బహిష్టు కాలంలో వంట, వడ్డన చేయరాదు.
- అరటిపత్రాలలో భోజనం చేసిన తర్వాత విస్తరిని మడవకూడదు.
- ఎంగిలి విస్తరాకులను తీసేవారికి వచ్చే పుణ్యం అన్నదాతకు రాదు.
- భోజనం అయ్యాక చేతులు, కాళ్లు కడుక్కోవాలి.
- భోజనం అయ్యాక భోజన ప్రదేశాన్ని శుభ్రం చేసి మళ్ళీ వడ్డించాలి.
- స్నానం చేసి మాత్రమే వంట వండాలని నియమం.
- ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినరాదు (ద్విపాక దోషం).
- ఆడవారు గాజులు లేకుండా భోజనం చేయరాదు, వడ్డించరాదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
భోజనం ఏ దిక్కున కూర్చుని చేయాలి?
తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. భోజనానికి ముందు కాళ్లు, చేతులు కడుక్కుని, తడికాళ్లను తుడుచుకుని కూర్చోవాలి.
భోజన సమయంలో నీటిపాత్ర ఏ వైపు ఉంచాలి?
భోజన సమయంలో నీటిపాత్రను కుడివైపు ఉంచుకోవాలి. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ద్విపాక దోషం అంటే ఏమిటి?
ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడాన్ని ద్విపాక దోషం అంటారు. సదాచార నియమం ప్రకారం అలా తినరాదు.
భోజనం చేసేటప్పుడు చేయకూడని పనులు ఏమిటి?
భోజనం మధ్యలో లేవకూడదు, వంట బాగాలేదని దూషించకూడదు, ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, వేదం చదువరాదు. నిలబడి అన్నం తినడం, మంచం మీద కంచం ఒడిలో పెట్టుకుని తినడం కూడా తగదు.
అరటి ఆకులో భోజనం చేశాక విస్తరిని మడవచ్చా?
అరటిపత్రాలలో భోజనం చేసిన తర్వాత విస్తరిని మడవకూడదు. భోజనం అయ్యాక విస్తరిలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుందని నియమం.
ఉపనయనం అయినవారు భోజనానికి ముందు ఏమి చేయాలి?
ఉపనయనం చేసినవారు ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకోవాలి. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోవద్దు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- భార్యా శ్రేష్ఠతమా సఖా – సనాతన ధర్మంలో దాంపత్య మహిమ
- ఆనందమైన జీవితం కోసం 15 విలువైన చిట్కాలు
- ఆధునిక జీవనశైలి: మన సంబంధాలను మెల్లగా దూరం చేస్తున్న కాలం
- నవగోప్య విషయాలు
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం



