1. " నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. "అన్నం పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! …. ఎంతయినా అమ్మ అంటే అన్నం. …. అన్నం అంటే అమ్మ ! అంతే ! ( జంధ్యాల గారు ) .
  2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం ! ( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .
  3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! … వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! ( రేలంగి వెంకట్రామయ్య గారు ) . 4. . ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి ! ( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .
  4. ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా " మనల్ని నమ్ముకున్న వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి పని చేస్తేనే ఇవి మన ఇంటి వరకు వచ్చాయి.. అని బీదసాదలకి ధాన్యం చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు ! ( ఆచార్య ఆత్రేయ గారు )
  5. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! ( చాగంటి కోటేశ్వరరావు ) .
  6. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !! (గౌతమ బుద్దుడు ).
  7. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! పల్చని నీళ్ళ చారు కూడా అమృతంలా రుచిస్తుంది ! ( మాతా అమృతానందమయి )
  8. మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు …. మీ పూర్వీకులు చేసిన పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి..

Advertisement

ఎంతటి మంచి వాక్యాలు. ? తమ అనుభవ సారాన్ని మనకి పంచిన పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం !! సేకరణ… ✍️

తరచుగా అడిగే ప్రశ్నలు

అమ్మ గురించి, అన్నం గురించి జంధ్యాల గారు ఏమన్నారు?

వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా అమ్మ 'అన్నం పెట్టేస్తా నాన్నా' అనేవారని జంధ్యాల గారు గుర్తు చేసుకున్నారు. అమ్మ అంటే అన్నం, అన్నం అంటే అమ్మ అని ఆయన మాట.

మంచి భోజనం లేని పెళ్ళి గురించి విశ్వనాధ సత్యనారాయణ గారు ఏమన్నారు?

మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం అని విశ్వనాధ సత్యనారాయణ గారు చెప్పారు.

ఆకలితో ఉన్నవారి విషయంలో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమి చెప్పారు?

ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం అని, ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి అని ముళ్ళపూడి వెంకటరమణ గారు అన్నారు.

'అన్నీ మనవి కావు' అనే మాట ఆచార్య ఆత్రేయ గారికి ఎవరు నేర్పారు?

ఏటా వంద బస్తాల బియ్యం ఇంటికి వచ్చినా ఆత్రేయ గారి తండ్రిగారు, కష్టపడిన వారి వల్లే అవి వచ్చాయని బీదసాదలకు ధాన్యం చేటలతో పంచేవారు. ఆ మాటలోని వేదార్థం పెద్దయ్యాకే అర్థమైందని ఆత్రేయ గారు చెప్పారు.

అమ్మకు అన్నం పెట్టడం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఏమన్నారు?

అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం అని, అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు.

పిల్లలు దూరంగా ఉన్నా వేళకు అన్నం తినగలగడం ఎవరి గొప్పతనం?

పిల్లలు ఎంత దూరంలో ఉన్నా వేళ పట్టున అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదు, మన గొప్పా కాదు, మన పూర్వీకులు చేసిన పుణ్యఫలమే అని గుర్తించుకుని బ్రతకాలి.