ఫలప్రాప్తి

ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములలో మాత్రమే కాక ప్రతిరోజూ పఠిస్తే పితృదోషములు తొలగిపోతాయి.
ఎవరైనా తమ పితరుల విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే, పశ్చాత్తాపంతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అది ప్రాయశ్చిత్తముగా పరిగణించబడుతుంది.
పితరుల అనుగ్రహం లభించి, వారు సుఖసంపదలను ప్రసాదిస్తారు.

Advertisement

జన్మదినాన తండ్రికి నమస్కరించి ఈ స్తోత్రం చదివితే పితృఅనుగ్రహం మరింత లభిస్తుంది.


Advertisement

బ్రహ్మ ఉవాచ

౧.
నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ।
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే॥

మనకు జన్మనిచ్చినవారు, సర్వదేవతాస్వరూపులు, సుఖములను ప్రసాదించే మహాత్ములైన పితరులకు నమస్కారములు.

౨.
సర్వ యజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే।
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ॥

Advertisement

సర్వయజ్ఞస్వరూపులు, స్వర్గస్థులు, సర్వతీర్థముల ఆవాసములు, కరుణాసముద్రములు – ఆ పితరులకు నమస్కారములు.

౩.
నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః।
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ॥

తక్షణమే ప్రసన్నమయ్యే శివరూపులు, ఎల్లప్పుడూ క్షమించే వారు, సుఖములను ప్రసాదించే పితరులకు నమస్కారములు.

Advertisement

౪.
దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మాయావపుః।
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః॥

ధర్మార్థ సాధనకు దుర్లభమైన ఈ మానవ జన్మను ప్రసాదించిన పితరులకు నమస్కారములు.

౫.
తీర్థస్నానతపోహోమజపాదీన్ యస్య దర్శనం।
మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః॥

Advertisement

ఎవరి దర్శనం వలన అనేక తీర్థస్నానాలు, తపస్సులు, హోమాలు, జపముల ఫలితములు లభిస్తాయో – మహాగురువులకు కూడా గురువులైన ఆ పితరులకు నమస్కారములు.

౬.
యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం।
అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమోనమః॥

ఎవరికీ నమస్కారం చేసి, స్తోత్రం చేస్తే, కోట్లు సంఖ్యలో పితృతర్పణాలు చేసిన ఫలితం, వందల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం లభిస్తుందో – ఆ పితరులకు నమస్కారములు.


Advertisement

ఫలశ్రుతి

ఇదం స్తోత్రం పితృపుణ్యం యః పఠేత్ ప్రయతో నరః।
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ॥

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా।
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్॥

నానాపకర్మకృత్వాపి యః స్తౌతి పితరం సుతః।
స ధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్॥

పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి॥