శాస్త్ర విధి ప్రకారం ప్రతివ్యక్తి నిర్వర్తించాల్సిన యజ్ఞాలు

  • భూతయజ్ఞం – సమస్త ప్రాణులకోసం కొంత అన్నం కేటాయించడం.
  • మనుష్య యజ్ఞం – ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం.
  • పితృయజ్ఞం – పితరులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మ.
  • దేవయజ్ఞం – హోమాదులు.
  • బ్రహ్మయజ్ఞం – సమాజానికి మార్గదర్శనం కోసం అధ్యాపన.

Advertisement

పితృయజ్ఞం ప్రత్యేకత

తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం అపారమైనది. అందువల్ల పితృదేవతలకు శ్రాద్ధకర్మ నిర్వహించడం మానవ ధర్మంగా పేర్కొనబడింది. మహాలయ పితృపక్షాల్లో వారిని స్మరించడం వల్ల సుఖసమృద్ధి, సంతోషం కలుగుతాయి.


Advertisement

మహాలయం అర్థం

  • మహాన్ - అత్యంతికోలయో యత్ర- మహాలయః – మహా వినాశనం జరిగే రోజు.
  • మరో అర్థం – ప్రళయం వరకు నిలిచివుండి, ఆ తర్వాత లయమయ్యేది మహాలయం.


దక్షిణాయన కాలం – పితృగణాల ఆశ

దైవగణాలకు దక్షిణాయనం రాత్రికాలం. ఇది ఆషాఢమాస కృష్ణపక్షం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పితృగణాలు తిరిగి జన్మ పొందాలన్న కాంక్ష పెరుగుతుంది.

Advertisement

మనుస్మృతి ప్రకారం

ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుంచి భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు మన వద్ద అన్నాదులను కోరుతారు. తాపం, ఆకలి నివారించుకోవడానికి ఎదురుచూస్తారు.


మహాభారతం & చతుర్వర్గ చింతామణి ప్రకారం

సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పటి నుంచి 16 రోజులపాటు పితృయజ్ఞం చేయాలని ఆదేశం ఉంది. అలా చేస్తే ప్రతిరోజూ గయాశ్రాద్ధం చేసిన ఫలం లభిస్తుంది.

Advertisement

శ్రాద్ధం భావం

శ్రద్ధతో చేసే కర్మే శ్రాద్ధం.
మూడు శరీరాలు – భౌతిక, ప్రేత, సూక్ష్మ – ఇవి వసు, రుద్ర, ఆదిత్య రూపాలలో పరిగణించబడతాయి.

శ్రాద్ధం చేసే నాలుగు విధులు:

  1. అగ్నిముఖం
  2. బ్రాహ్మణ భోజనం
  3. పిండప్రదానం
  4. ఉపవాసం


పితృప్రియమైన 96 రోజులు (షణ్ణవతులు)

  • 14 మన్వాదులు
  • 16 మహాలయాలు
  • 4 యుగాదులు
  • 12 సంక్రాంతులు
  • 12 అమావాస్యలు
  • 13 వ్యతీపాతములు
  • 13 వైధృతులు
  • 12 అన్వష్టకాలు

మొత్తం: 96 రోజులు.
కనీసం మహాలయ అమావాస్యనాడైనా పితృయజ్ఞం చేయాలని శాస్త్రం చెప్పింది.


అర్హతలు

  • తండ్రి మరణించిన వారే మహాలయ పక్షం చేయగలరు.
  • తండ్రి బ్రతికి, తల్లి మరణించినట్లయితే శ్రాద్ధం చేయవచ్చు కానీ నువ్వుల తర్పణం విడువకూడదు.
  • కుమారులు లేనప్పుడు, కూతురి కొడుకు (దౌహిత్రుడు) అధికారం పొందుతాడు.
  • కూతురు కూడా బ్రాహ్మణుని ద్వారా కర్మ జరిపించవచ్చు.
  • భార్య గర్భిణిగా ఉంటే పిండదానం కాకుండా సంకల్ప శ్రాద్ధం చేయాలి.