సత్సంగం🔔

గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది! వెంటనే గంగానదినే అడిగాడట!
గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది!
వెంటనే గంగానదినే అడిగాడట!
అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ? అని.
అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.
అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని!
సముద్రాన్నే అడిగాడు!
ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని!
దానికా సముద్రుడు!
నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోకి పంపిస్తున్నాను' అని బదులు ఇచ్చాడట.
అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!
ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని! అని అడగగా!!!
అవి పకపకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా,
ఓహో!!! ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!
అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!
ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.
పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.
ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!
ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును అని ఈ శ్లోకం అర్థం.
ప్రయాగలో పుణ్యస్నానం ఆచరించలేని వారికి అంకితం
తరచుగా అడిగే ప్రశ్నలు
గంగలో స్నానం చూసి ఋషి గంగానదిని ఏమని అడిగాడు?
లక్షలాది మంది గంగలో మునిగి పాపాలు వదిలేస్తుంటే ఇంత పాపభారం ఎలా మోస్తున్నావని ఋషి గంగను అడిగాడు. ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నానని గంగ బదులిచ్చిందని కథ.
సముద్రుడు, మేఘాలు పాపాలను ఏం చేస్తున్నామని చెప్పారు?
సముద్రుడు పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి మేఘాలలోకి పంపిస్తున్నానని చెప్పాడు. మేఘాలు పకపకా నవ్వి, వాటిని వర్ష రూపంలో మళ్లీ మనుషుల మీదే కురిపిస్తున్నామని బదులిచ్చాయి.
సత్సంగం కథ నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏమిటి?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కర్మ ఫలితాలను వదిలించుకోలేరు. చేసిన పాపాలు చివరికి మన మీదే పడి మనమే అనుభవించాల్సి వస్తుందని ఋషి గ్రహించాడు.
'ఇదం తీర్ధమిదం తీర్ధం' శ్లోకాన్ని ఎవరు ఎవరికి ఉపదేశించారు?
'ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః' అనే శ్లోకాన్ని పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించాడు.
'ఇదం తీర్ధమిదం తీర్ధం' శ్లోకం అర్థం ఏమిటి?
ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం, ఆ తీర్థంలో స్నానం చేస్తే మోక్షం అని పరుగులు తీసేవారు భ్రమకు లోబడినవారు. ఆత్మ జ్ఞాన తీర్థంలో స్నానం చేయనివారికి మోక్షం ఎలా కలుగుతుందని శ్లోకం ప్రశ్నిస్తుంది.
ప్రయాగలో పుణ్యస్నానం చేయలేనివారికి ఈ సత్సంగం ఏం చెబుతుంది?
ఈ సత్సంగం ప్రయాగలో పుణ్యస్నానం ఆచరించలేని వారికి అంకితం చేయబడింది. తీర్థస్నానం కంటే ఆత్మ జ్ఞానమే మోక్షానికి మార్గమని, కర్మ ఫలితాలను ఎవరూ తప్పించుకోలేరని ఇది గుర్తుచేస్తుంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు నుంచి మరిన్ని
- శ్రీ గురు పాదుకా స్తోత్రం – ప్రతి శ్లోకానికి తెలుగు అర్థం, భావం
- వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి? – ఉచ్చారణ ప్రాముఖ్యతను తెలిపే శ్లోకం & భావం
- గాయత్రీరహితో విప్రో న స్పృశేత్ తులసీదలమ్ – శ్లోకం అర్థం మరియు గాయత్రీ మంత్ర ప్రాముఖ్యత
- షట్కుక్షి అంటే ఏమిటి? | గాయత్రీ మంత్రంలోని ఆరు రహస్యాలు
- హనుమాన్ చాలీసా పారాయణం వెనుక దాగి ఉన్న విజ్ఞాన రహస్యాలు — న్యూరో సైన్స్, నాద శాస్త్రం, ఖగోళ రహస్యం




