స్తోత్రమ్, పూజలు, వ్రతాలు
శ్రీకృష్ణాష్టమి పూజా విధానం

పరివార సహిత కృష్ణారాధన కృష్ణాష్టమి రోజున కృష్ణునితో పాటుగా ఈ ఏడుగురిని ఆరాధించాలి – వసుదేవుడుదేవకీదేవినందాదేవియశోదాదేవిబలరాముడుచండికాదేవిశ్రీకృష్ణుడు ఎలా ఆరాధించాలి? వీరి ప్రతిమలు లేదా చిత్రాలు ఉంటే వాటిని ఉంచి పూజించాలి.
పరివార సహిత కృష్ణారాధన
కృష్ణాష్టమి రోజున కృష్ణునితో పాటుగా ఈ ఏడుగురిని ఆరాధించాలి –
Advertisement
- వసుదేవుడు
- దేవకీదేవి
- నందాదేవి
- యశోదాదేవి
- బలరాముడు
- చండికాదేవి
- శ్రీకృష్ణుడు
ఎలా ఆరాధించాలి?
- వీరి ప్రతిమలు లేదా చిత్రాలు ఉంటే వాటిని ఉంచి పూజించాలి.
- లేకపోతే కృష్ణుని ప్రతిమ ముందు ఉంచి, మిగతా వారిని మనస్సులో భావించాలి.
- ఇలా చేస్తే కృష్ణాష్టమి పూజ సంపూర్ణమవుతుంది.
నమస్కార మంత్రాలు
Advertisement
శ్రీ దేవక్యై నమః
శ్రీ వసుదేవాయ నమః
శ్రీ యశోదాయై నమః
శ్రీ నందాయ నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీ రామాయ నమః
శ్రీ చండికాయై నమః
సకల దేవతా పరివారేభ్యో నమః
శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం
వినియోగ శ్లోకం
శ్రుణుధ్యం మునయస్సర్వే గోపాలస్య మహాత్మ్యం
అనంతస్యా ప్రమేయస్య నామ ద్వాదశకస్తవమ్
అర్జునాయ పురాప్రోక్తం గోపాలేన మహాత్మనా
ద్వారకాయాం ప్రార్థయతే యశోదాయాశ్చ సన్నిధౌ
శక్తిహి శ్రీ గోపాలకృష్ణ ప్రీత్యర్దే జపే వినియోగః
Advertisement
ధ్యాన శ్లోకం
జానుభ్యామపి ధావయంతం బాహుభ్యామతి సుందరం
సకుండలాలకం బాలం గోపాలం చింతయేదుషః
ద్వాదశ నామాలు
ప్రథమం తు హరింవిద్యత్
ద్వితీయం కేశవం తథా
తృతీయం పద్మనాభం చ
చతుర్థం వామనం తథా
పంచమం వేదగర్భాం చ
షష్టమం మధుసూధనం
సప్తమం వాసుదేవం చ
వరాహం చ అష్టమం తథా
నవమం పుండరీకాక్షం
దశమం తు జనార్దనమ్
కృష్ణం ఏకాదశం ప్రోక్తం
ద్వాదశం శ్రీధరం తథా
ఫలశ్రుతి
ఈ ద్వాదశ నామాలను కాలత్రయం (ప్రభాతం, మధ్యాహ్నం, సాయంత్రం) జపించినవారికి కలిగే ఫలం:
చాంద్రాయణ సహస్రస్య కన్యాదాన శతస్య చ
అశ్వమేధ సహస్రస్య ఫలమాప్నోతి మానవః




