స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది…..

blank

రోజూ ఉదయమే చాలా మంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంత మంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా… లేదా వీళ్ళకేసి చూస్తున్నా… వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే…

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి… కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒక వేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది…

ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి…

తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||

తాత్పర్యం…

తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను. పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగు వానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి. లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే… ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే… అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు.

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజలు వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే… ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే… మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా… ఒక్కాసారి ఆలోచించండి. తెలియని వారికి తెలియచేసి వారికి సాయం చేయండి…

┈┉┅━❀꧁🌹ॐ🌹꧂❀━┅┉┈
అధ్యాత్మికం బ్రహ్మానందం

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి