గాయత్రి మంత్రంగురించి మహాత్ములు చెప్పినవి..

🌷 వేదవ్యాస మహర్షి 🌷 🌿 గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించడం, సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆటుకోని తినటంలాంటిది. శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం –"బ్రహ్మయే గాయత్రి, గాయత్రియే బ్రహ్మ".
🌷 వేదవ్యాస మహర్షి 🌷
🌿 గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించడం, సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆటుకోని తినటంలాంటిది. శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం –
"బ్రహ్మయే గాయత్రి, గాయత్రియే బ్రహ్మ".
🌷 విశ్వామిత్రుడు 🌷
🌸 బంగారు రంగులో మెరిసే సూర్యబింబం మధ్యలో గాయత్రి మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసినవాడు, జనన మరణ చక్రం నుండి త్వరగా విముక్తి పొందుతాడు.
🌷 దేవీ భాగవతం 🌷
🌿 గాయత్రి మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి, బుద్ధిని పవిత్రం చేస్తుంది.
"తత్ సవితుర్వరేణ్యం భర్గః".
🌷 కూర్మ పురాణం 🌷
🌸 ముల్లోకాలకు జ్ఞానాన్ని ప్రసాదించేది గాయత్రి దేవత. ఆమెనే వేదమాత. గాయత్రీని మించిన మంత్రం లేనే లేదు.
🌷 యాజ్ఞవల్క్యుడు 🌷
🌿 ఒక త్రాసులో ఇటు వేదాలు, అటు గాయత్రీ మంత్రాన్ని ఉంచి తూచితే గాయత్రి మంత్రమే అధికంగా నిలుస్తుంది.
🌷 ఆర్ష సూక్తి 🌷
🌸 "న గాయత్ర్యాః పరం మంత్రం, న మాతుః పర దైవతం".
🌷 భీష్మాచార్యులు 🌷
🌿 "ఓ ధర్మరాజా! గాయత్రీ మంత్రమును నిరంతరం జపించేవారు ఎప్పటికీ దుఃఖాన్ని అనుభవించరు".
🌷 అత్రి మహర్షి (భవిష్య పురాణం) 🌷
🌸 సూర్యుని ఎదుట 8,000 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే, అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
🌷 లఘు అత్రి సంహితా 🌷
🌿 గాయత్రి మంత్రాన్ని జపించే వారినే పితృకార్యాలకు ఆహ్వానించాలి.
🌷 పద్మ పురాణం (పరాశర మహర్షి) 🌷
🌸 గాయత్రిని నిత్యం జపించే వారి మహాపాపాలు, ఉపపాపాలు కూడా నశిస్తాయి.
🌷 అగ్ని పురాణం 🌷
🌿 ఉదయం, సాయంత్రం గాయత్రి మంత్రాన్ని జపించే బ్రాహ్మణుడు ఎలాంటి దానం చేసినా, దోషం కలుగదు.
🌷 శంఖ స్మృతి 🌷
🌸 నరక నివారణకు, వేద-ఉపనిషత్తుల సారమైన గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు.
🌷 సూత సంహితా (యజ్ఞ వైభవ ఖండం) 🌷
🌿 అన్నం, జలానికి సమానమైన దానం, అహింసకు సమానమైన తపస్సు, గాయత్రిని మించిన మంత్రం లేనే లేదు.
🌷 నారద మహర్షి 🌷
🌸 గాయత్రీ సమస్త దేవతా స్వరూపం. ఆమె నివసించే చోట శ్రీమన్నారాయణుడు స్వయంగా ఉంటాడు.
🌷 వశిష్ఠ మహర్షి 🌷
🌿 మూర్ఖుడు కూడా గాయత్రీ మంత్రాన్ని జపిస్తే, దేవతల వంటి మహిమను పొందుతాడు.
🌷 మహాత్మా గాంధీ 🌷
🌸 నిత్యం గాయత్రిని జపించే వారికి ఆత్మోన్నతి, రోగ నాశనం, అపాయ నాశనం జరుగుతాయి.
🌷 ఆది శంకరులు 🌷
🌿 "గాయత్రి మహిమను పూర్తిగా వర్ణించడానికి మానవ సామర్థ్యం సరిపోదు. ఇదే ఆది మంత్రం."
🌸 కాబట్టి, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గాయత్రి మంత్రాన్ని ఉపాసించటం ఎంతో శ్రేయస్కరం! 🌸 స్వస్తి! 🙏




