ఎందుకయా సాంబశివా 🎶

మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అమర గీతం 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయఈ అల్లరి చేతలుఈ బూడిద పూతలుఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయసాంబశివా సాంబశివా 🔹 అలల తోటి గంగ పట్టితలపాగా చుట్టినెలవంకను మల్లెపూవుకలి
మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అమర గీతం
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు
ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా
🔹 అలల తోటి గంగ పట్టి
తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు
కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా
🔹 తోలు గట్టి పటకాగా
కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి
ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా
🔹 రుద్రుడవో, కారుణ్య సముద్రుడవో
హరహరహర
ఎందుకయా ఈ దాసుని
కందవయా దయామయా
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా 🚩🙏🌸🎻
✍️ కవి: దేవులపల్లి కృష్ణశాస్త్రి 🎶
తరచుగా అడిగే ప్రశ్నలు
ఎందుకయా సాంబశివా పాట ఎవరు రాశారు?
ఎందుకయా సాంబశివా గీతాన్ని మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు. ఇది ఆయన అమర గీతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ఎందుకయా సాంబశివా పాటలో శివుని రూపం ఎలా వర్ణించబడింది?
ఈ గీతంలో శివుడు బూడిద పూతలతో, అలల గంగను తలపాగాగా చుట్టి, నెలవంకను మల్లెపూవు తురాయిగా పెట్టుకున్నట్లు వర్ణించబడ్డాడు. చేతిలో త్రిశూలం, ఫాలమందు కీల కూడా వర్ణించబడ్డాయి.
ఎందుకయా సాంబశివా పాట భావం ఏమిటి?
భక్తుడు శివునితో చనువుగా 'ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు ఎవరు నీకు చెప్పేరయ' అని ప్రశ్నిస్తాడు. చివరికి శివుని కారుణ్య సముద్రునిగా పిలిచి, ఈ దాసునికి అందవా అని దయామయుని వేడుకుంటాడు.
ఎందుకయా సాంబశివా పాట పల్లవి ఏమిటి?
పల్లవి: "ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు". ప్రతి చరణం చివర "సాంబశివా సాంబశివా" అని పునరావృతమవుతుంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- శుభకార్యాల్లో భోజనాలు ఎందుకు పెడతారు? అన్నదానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
- ప్రేమకు, అనుబంధానికి తేడా ఏమిటి? వేదాంతం చెప్పే నిస్వార్థ ప్రేమ, విశ్వప్రేమ
- గార్గి మరియు మైత్రేయి: ఉపనిషత్తుల మహిళా ద్రష్టలు
- ప్రవాస భారతీయులకు ఆత్మ విచారం: బిజీ కుటుంబాల కోసం ఆత్మ-విచారణ దినచర్య
- అద్వైత వేదాంతం అంటే ఏమిటి? శంకరుల అద్వైతానికి ప్రారంభ మార్గదర్శి




