లడ్డూలు- చీమలు: ఓ సూక్తి కథ

శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న సంఘటన ఒకరోజు కాళీమాత ఆలయంలో ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు. అనుకోకుండా చీమలు లడ్డూలపై చేరాయి.
శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న సంఘటన
ఒకరోజు కాళీమాత ఆలయంలో ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు. అనుకోకుండా చీమలు లడ్డూలపై చేరాయి. లడ్డూ తయారు చేస్తున్నవారు అవి ఎలా పోగొట్టాలో తెలియక రామకృష్ణ పరమహంస గారిని అడిగారు.
అప్పుడు పరమహంస గారు "చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి, ఇక ఇటు రావు" అని సూచించారు. అలా చేయగానే చీమలు చక్కెర రుచి చూసి లడ్డూలను వదిలేసి వెళ్లిపోయాయి.
🌿 పరమహంస గారి బోధన:
"మనుషులు కూడా చీమల్లాంటి వారే. మొదట ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు, కానీ మధ్యలో చిన్న చిన్న ప్రలోభాలకు లోనై మార్గం మరిచిపోతారు. చీమలు లడ్డూని వదిలేసి చక్కెర పొడితో సంతృప్తి చెందినట్టే, మనం కూడా భగవంతుని సాధన ప్రారంభించినా మార్గమధ్యలో ఎక్కడో ఆగిపోతుంటాము."
👉 సత్యమైన ఆనందాన్ని పొందే వారు చాలా అరుదు!
👉 చిన్న చిన్న లాభాలతో తృప్తి చెందకుండా, జీవన లక్ష్యం వైపే దృష్టి సారించాలి!
🌸 హరహర మహాదేవ్ 🌸
🌿 స్వస్తి
తరచుగా అడిగే ప్రశ్నలు
లడ్డూలు చీమలు కథ ఎవరు చెప్పారు?
ఇది శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న సంఘటన. కాళీమాత ఆలయంలో ప్రసాదం కోసం లడ్డూలు తయారు చేస్తుండగా వాటిపై చీమలు చేరిన సందర్భం నుంచి ఈ బోధన వచ్చింది.
లడ్డూలపై చేరిన చీమలను పోగొట్టడానికి పరమహంస ఏం సూచించారు?
చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లమని సూచించారు. అలా చేయగానే చీమలు చక్కెర రుచి చూసి లడ్డూలను వదిలేసి వెళ్లిపోయాయి.
లడ్డూలు చీమలు కథలో మనుషులను చీమలతో ఎందుకు పోల్చారు?
మనుషులు మొదట ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా, మధ్యలో చిన్న చిన్న ప్రలోభాలకు లోనై మార్గం మరిచిపోతారు. చీమలు లడ్డూను వదిలి చక్కెర పొడితో సంతృప్తి చెందినట్టే మనం కూడా సాధన మధ్యలో ఆగిపోతుంటామని పరమహంస బోధించారు.
లడ్డూలు చీమలు కథ నీతి ఏమిటి?
చిన్న చిన్న లాభాలతో తృప్తి చెందకుండా జీవన లక్ష్యం వైపే దృష్టి సారించాలి. సత్యమైన ఆనందాన్ని పొందేవారు చాలా అరుదని పరమహంస గుర్తుచేశారు.
భగవంతుని సాధనకు లడ్డూలు చీమలు కథ ఎలా వర్తిస్తుంది?
భగవంతుని సాధన ప్రారంభించినా చాలామంది మార్గమధ్యలో ఎక్కడో ఆగిపోతుంటారు. చిన్న ప్రలోభాలకు ఆగకుండా అసలు లక్ష్యమైన భగవంతుడి వైపే సాగాలనేది పరమహంస గారి బోధన.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
కథలు నుంచి మరిన్ని
- పిల్లల కోసం దసరా కథ: రాముడు-రావణుడు, దుర్గమ్మ-మహిషాసురుడు (చదివి వినిపించే కథలు)
- శ్రీకృష్ణుడు, గోవర్ధన గిరి కథ: అధికారంపై విశ్వాసం సాధించిన విజయం
- సులభంగా రామాయణం: దసరాకు దారితీసిన శ్రీరాముని కథ
- దీపావళి రోజున శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని ఎలా జయించాడు: వామనావతార కథ
- నిర్జల ఏకాదశి మహాత్మ్యం | భీముడు – వ్యాసమహర్షి సంభాషణ | పాండవ నిర్జల ఏకాదశి కథ




