రాఖీ పౌర్ణమి, అంటే రక్షా బంధన్ పండుగ—ఇది ఎటువంటి కులానికి, మతానికి పరిమితం కాదు.
మనుషులందరికీ రక్షణ అవసరం.
కానీ ప్రతి ఒక్కరూ తమను తాము అన్ని వేళల్లో రక్షించుకోవడం సాధ్యం కాదు.
దానికి ఇతరుల సహాయం కూడా తప్పనిసరి.

ముఖ్యంగా—

Advertisement

  • దొంగలనుండి,
  • దుర్మార్గులనుండి,
  • దేశద్రోహులనుండి,
  • విదేశీ దురుద్దేశ శక్తులనుండి,

మనమందరం అప్రమత్తంగా, జాగ్రత్తగా, సమైక్యంగా ఉండి ఒకరినొకరు రక్షించుకోవాలి.

ఈ భావానికి ప్రతీకమే "రక్షా బంధన్".

Advertisement


రాఖీ కట్టే సందర్భంలో ప్రతిజ్ఞ

ఈరోజు మనమందరం రాఖీ కట్టేటప్పుడు ఇలా చెప్పుకోవాలి—

"నేను నీకు రక్ష! నీవు నాకు రక్ష! మనమందరం మన దేశ ప్రజలకు, మన దేశానికీ, మన భారతీయ ధర్మానికి, మన భారతీయ సంస్కృతికి రక్షణగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము."

Advertisement

రాఖీ పండుగ యొక్క పూర్వ సంప్రదాయం

ఈ దేశంలో అనాదిగా రాఖీని మన పక్కన ఉన్న వారికి—
ఆడ, మగ, ప్రాంతం, భాష, కులం, మతం అనే తేడా లేకుండా కట్టడం ఆనవాయితీ.

కానీ, ఎడారి మతాల దాడులు (ప్రత్యేకంగా ముస్లింల ఆక్రమణలు) మొదలైన తరువాత, వారు స్త్రీలను—
ముఖ్యంగా బాలికలను, యువతులను ఎత్తుకుపోవడం చూసాక, ఆడపిల్లలు తమ అన్నతమ్ముళ్లకు, రక్షకులకు, "అన్నయ్యా, మా మానప్రాణాలు రక్షించు" అని రాఖీ కట్టడం మొదలైంది.


ఇప్పటి అవసరం

Advertisement

ఈ కాలంలో మనం రక్షా బంధన్‌ను అసలు భావంలోనే జరుపుకుందాం.
మన భారతీయుల్లో సుహృద్భావం, ఐకమత్యం పెంచుకుందాం.

నేను గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు, పేద ప్రజల చేత పలు చోట్ల రాఖీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
నా లక్ష్యం: కనీసం 25,000 మంది రాఖీలు కట్టుకోవడం.

మీరు కూడా కనీసం 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మందితో రాఖీ కట్టించండి.
అప్పుడు వారందరితో ఇలా ప్రతిజ్ఞ చేయించండి—

"నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం మన దేశానికీ, ధర్మానికీ, సంస్కృతికీ రక్షణగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము."


జై భారత్!