ఆదివారం సెలవువద్దు… ఆదివారం పవిత్ర దినం! ఇకనైనా మేల్కొందాం!

ఆదివారం నాడు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పిన ఓ శ్లోకం: అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా || స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి || తాత్పర్యం: మాంసాహారం తినడంమద్యం సేవించడంస్త్రీ సహవాసంక్షవరం చేసుకోవడంతలకు నూనె పెట్టుకోవడం ఇవి ఆదివారం నాడు నిషేధించబడ్డాయి. కానీ, ఇవే పనులు మనం ఆదివారమే ఎక్కువగా చేస్తున్నాం!
ఆదివారం నాడు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పిన ఓ శ్లోకం:
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||
తాత్పర్యం:
- మాంసాహారం తినడం
- మద్యం సేవించడం
- స్త్రీ సహవాసం
- క్షవరం చేసుకోవడం
- తలకు నూనె పెట్టుకోవడం
ఇవి ఆదివారం నాడు నిషేధించబడ్డాయి. కానీ, ఇవే పనులు మనం ఆదివారమే ఎక్కువగా చేస్తున్నాం! మన పూర్వీకులు చెప్పిన విధంగా, ఈ కర్మలను ఆచరించినవాడు జన్మజన్మలకు దరిద్రుడవుతాడని స్పష్టంగా ఉద్ఘాటించారు.
దరిద్రతనం అంటే కేవలం ధనలేమి మాత్రమే కాదు..!
- కుటుంబ సౌఖ్యం లేకపోవడం
- ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం కూడా దరిద్రతనే!
ఆదివారం—సూర్యుని జన్మదినం!
ఈ పవిత్ర దినం తాగుబోతులకి, భోగ భాండిరులకు ఇష్టమైన రోజుగా మారింది. కానీ మన సనాతన ధర్మం ఈ రోజుకు అపారమైన ప్రాముఖ్యతను ఇచ్చింది. ఎందుకంటే, మన భారతీయ హైందవ సంస్కృతిలో సూర్యోపాసన ప్రధానమైనది.
సూర్యుడు—ప్రత్యక్ష దైవం!
అందుకే మనకి ముఖ్యమైన పండుగలన్నీ సౌరమానం ఆధారంగా వస్తాయి.
- సంధ్యావందనం, సూర్యనమస్కారం లాంటి సంప్రదాయాలు సూర్యుని ఆరాధించేందుకు రూపొందించబడ్డాయి.
ఆదివారం సెలవు—మన సంస్కృతిపై విదేశీ కుట్ర!
మన భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనం చూసి ఓర్వలేక, బ్రిటీషు పాలకులు (Thomas Babington Macaulay) మన సంస్కృతిని నాశనం చేసేందుకు ఆదివారం సెలవును ప్రవేశపెట్టారు.
ఈ ప్రభావం ఎంత ఘోరంగా మారిందంటే...
- ఆదివారం నాడు దేవాలయాలు వెలవెలబోతున్నాయి.
- మద్యం దుకాణాలు, హోటళ్లు కిక్కిరిసిపోతున్నాయి.
- మధ్యాహ్నం వరకు నిద్రపోవడం అలవాటైపోయింది.
ఇప్పటికైనా మారుదాం!
- విదేశీ సంస్కృతిని విడనాడండి
- స్వదేశీ సంప్రదాయాలను పాటించండి
- సూర్యనమస్కారం చేయండి
- సూర్యోపాసన ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందండి
ఈ మార్పులు ఒక్కరోజులో సాధ్యమయ్యే పనికావు. కానీ, ఒక్కొక్కటీ క్రమంగా పాటిస్తే, మన సంప్రదాయం తిరిగి వెలుగొందుతుంది. సంస్కృతి పరిరక్షణ మన బాధ్యత
తరచుగా అడిగే ప్రశ్నలు
ఆదివారం నాడు చేయకూడని పనులు ఏమిటి?
శాస్త్రాల్లోని శ్లోకం ప్రకారం ఆదివారం నాడు మాంసాహారం తినడం, మద్యం సేవించడం, స్త్రీ సహవాసం, క్షవరం చేసుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం నిషేధించబడ్డాయి.
ఆదివారం నిషేధాల గురించి చెప్పే శ్లోకం ఏది?
"అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||" అనే శ్లోకం ఆదివారం నాడు మాంసం, మద్యం వంటివి నిషేధమని చెబుతుంది.
ఆదివారం ఎందుకు పవిత్ర దినంగా భావిస్తారు?
ఆదివారం సూర్యుని జన్మదినంగా భావిస్తారు. భారతీయ హైందవ సంస్కృతిలో సూర్యోపాసన ప్రధానమైనది కాబట్టి సనాతన ధర్మం ఈ రోజుకు అపారమైన ప్రాముఖ్యత ఇచ్చింది.
ఆదివారం నాడు ఏమి చేయడం మంచిదని చెబుతారు?
విదేశీ అలవాట్లను విడిచి స్వదేశీ సంప్రదాయాలను పాటించడం, సూర్యనమస్కారం, సంధ్యావందనం వంటి సూర్యోపాసన చేయడం మంచిదని చెబుతారు.
శాస్త్రాల ప్రకారం దరిద్రతనం అంటే కేవలం ధనలేమేనా?
కాదు. కుటుంబ సౌఖ్యం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం కూడా దరిద్రతనమేనని పెద్దలు చెబుతారు.
ఆదివారం సెలవు ఎలా వచ్చిందని చెబుతారు?
ప్రచారంలో ఉన్నట్లుగా, బ్రిటీషు పాలకులు (Thomas Babington Macaulay) భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికి ఆదివారం సెలవును ప్రవేశపెట్టారని కొందరు భావిస్తారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సంప్రదాయాలు నుంచి మరిన్ని
- షష్టిపూర్తి: హిందూ సంప్రదాయంలో 60వ పుట్టినరోజు వేడుక – విధులు, సామగ్రి, క్రమబద్ధమైన విధానం
- కర్వా చౌత్ వెనుక చరిత్ర, పురాణ కథలు: వీరవతి, కర్వా, ద్రౌపది మరియు 2026 వ్రతం (గురువారం, 29 అక్టోబర్)
- రామ్లీలా: భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి సజీవ పునఃకథనం
- భీష్మ తర్పణ విధి
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం




