07-10-2025 మంగళవారం రాశి ఫలితాలు

♈ మేషం చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.
♈ మేషం
చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా చేసే ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో విభేదాలు సంభవించే అవకాశం. దైవ కార్యక్రమాల్లో పాల్గొని ఆత్మశాంతి పొందుతారు.
♉ వృషభం
ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల అనుగ్రహంతో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. స్థిరాస్తి లావాదేవీలు లాభకరంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
♊ మిధునం
వృత్తి వ్యాపార విస్తరణలో విజయవంతం అవుతారు. బంధుమిత్రుల రాకతో గృహంలో ఉత్సాహం నెలకొంటుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి ఉన్నా సమయపాలనతో విజయాన్ని సాధిస్తారు.
♋ కర్కాటకం
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పాత సమస్యలు పరిష్కారం పొందుతాయి. కుటుంబంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అధికారుల సహాయం లభిస్తుంది.
♌ సింహం
అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. అదనపు బాధ్యతలు ఒత్తిడిని కలిగిస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న మాటపట్టింపులు జరుగవచ్చు. సంతాన విషయాల్లో ఊహించని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
♍ కన్య
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలు సమృద్ధిగా ఉంటాయి. విలువైన వస్తువులు, వాహనాలు పొందుతారు. మిత్రుల సహాయంతో పనులు సులభమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు లాభదాయకం.
♎ తుల
ముఖ్య ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. మిత్రులతో శుభకార్యాల ప్రస్తావనలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
♏ వృశ్చికం
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువైనా పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రావచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
♐ ధనస్సు
పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు శారీరక అలసట కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు మేలు కలిగిస్తాయి.
♑ మకరం
దూర బంధువుల రాకతో ఆనందం. గృహంలో శుభకార్యములు జరుగుతాయి. ముఖ్య వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ఆటంకాలు తొలగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.
♒ కుంభం
చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు. ప్రయాణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపార, ఉద్యోగ ప్రగతి మందకొడిగా ఉంటుంది.
♓ మీనం
ఆత్మీయుల నుంచి ముఖ్యమైన సమాచారం పొందుతారు. పాత మిత్రులతో విహారయాత్రలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది.




