పురోహితుని ఆశీర్వాదం విలువ

ఒక రోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది. ఫిర్యాదు దారుడు ఇలా ఫిర్యాదు చేశాడు: "ఒక పురోహితుడు తన సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు.
ఒక రోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది. ఫిర్యాదు దారుడు ఇలా ఫిర్యాదు చేశాడు:
"ఒక పురోహితుడు తన సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు. కావున, తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి, అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి."
జడ్జి గారు పురోహితునితో "మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా?" అని ప్రశ్నించారు.
పురోహితుడు సమాధానమిచ్చాడు:
"నేను సంపాదించినదంతయు సక్రమమే. ఇది అక్రమం కాదు."
"అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి," అని జడ్జి గారు అడిగారు.
పురోహితుడు వివరణ ఇచ్చాడు:
"ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని ఒక చెరువు వద్దకు వచ్చారు. ఆ సమయంలో నేను సంధ్యావందనం చేస్తున్నాను. వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారిని వారించి 'ఆత్మహత్య మహా పాపం' అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపచేశాను. నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు.
కొన్ని రోజుల తరువాత, నాపై గౌరవంతో వచ్చి కొంత ధనాన్ని ఇచ్చి 'ఆశీర్వదించండి' అని వేడుకున్నారు. నేను 'సంతాన సిద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.
కొన్ని సంవత్సరాల తరువాత వారు సంతోషంగా నాతో కలిసి తమ సంతానాన్ని తీసుకొని వచ్చి 'నా కుమారునికి మీ ఆశీస్సులు ఇవ్వండి' అని ప్రాధేయపడ్డారు. నేను 'మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు. మీకు మంచి కీర్తి ప్రతిష్ఠలు వస్తాయి' అని ఆశీర్వదించాను.
మరికొన్ని సంవత్సరాల తరువాత, ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు. నేను 'ఆయురారోగ్య వృద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.
అప్పుడు అతను మరికొంత ధనం ఇచ్చి ఆనందంగా వెళ్ళాడు.
అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనం సక్రమమైనదో లేక అక్రమమైనదో, అది మీ తీర్పు."
జడ్జి గారు ఈ విషయాన్ని సావధానంగా విని, "ఆ రోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే. ఆ ధనం సక్రమమైనదే.
అటుపిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు. అదియును సక్రమమైనదే!
మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు. అది కూడా సక్రమమే.
మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు.
ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము." అని తీర్పు ఇచ్చారు.
తర్వాత జడ్జి గారు అడిగారు:
"ఇంత ధనాన్ని మీకు ఇచ్చి ఆ పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాను. వారు ఎవరో తెలుపగలరా?"
పురోహితుడు "ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే!" అని తెలిపాడు.
వెంటనే జడ్జి గారు సాష్టాంగ నమస్కారం చేసి, పురోహితుని ఆశీర్వాదాన్ని అందుకున్నారు.
బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది! వారిని చిన్నచూపు చూడవద్దు.




