టైంజీవితంలో విలువైనవి బ్రతకడానికి ముఖ్యమైనవి

టైం
జీవితంలో విలువైనవి బ్రతకడానికి ముఖ్యమైనవి మనకి నిజంచెప్పాలంటే ఉచితంగానే లభిస్తాయి అవి పీల్చే గాలి త్రాగే నీరు (నేడు అక్కడక్కడ కొనుక్కోవలసి వస్తోంది) మనం గమనించని టైం ఉచితంగానే లభిస్తాయి. వీటిలో మనం టైం గురించి చెప్పుకుందాం
రోజు మనం ఉపయోగించే మాటలు టైం ఎంతైంది: టైం లేదురా: టైం అయిపొయింది వెళ్ళిపోయాడు: టైం బాగాలేదురా :వాడి టైం బాగుంది కదూ! నిజమే జీవితంలో టైం కి ఉన్న విలువ గుర్తింపు దేనికి లేదు.
ఇంటర్వ్యూ కి టైం కి చేరుకోకపోతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. పరీక్ష రాయడానికి టైం కి వెళ్లకపోతే పరీక్ష రాసె అవకాశం ఉండదు.
ఉచితంగా లభించే ఇంత విలువైన వెలకట్టలేని టైం ను ఎంత జాగ్రర్తగా పొదుపుగా వాడుకోవాలి?
నిజం చెప్పాలంటే డబ్బు కంటే విలువైనది టైం ఒక్కటి మాత్రమే. ఎందుకంటె టైం ఉంటే డబ్బు సంపాదించవచ్చు. కానీ డబ్బు ఉంటే టైం ను కొనలేము. డబ్బు తో కొనలేనిది కేవలం టైం మాత్రమే.
కానీ టైం ను వృధా చెయ్యకుండా పొదుపుగా వాడుకుంటూ ఆ మిగిలిన టైంను మనకు అత్యవసరమైన వాటికీ ఉపయోగించుకోవచ్చు. టైం ను పొదుపు చేసుకోవాలంటే క్రమశిక్షణ అత్యంత అవసరం. ఇంట్లో వస్తువులు ఆఫీసులో ఫైల్స్ ఒక పద్దతి ప్రకారం సర్దుకుంటే ఆ వస్తువుల గురించి ఫైల్స్ గురించి వెతుక్కుని టైం వృధా చేసుకోకుండా టైం మిగుల్చుకోవచ్చు.
ఇంట్లో వాహనాల బీరువాల తాళంచెవులు పద్ధతిగా పెట్టుకోవడం డబ్బుని ముఖ్యమైన కాగితాలను జాగ్రత్తగా భద్రపరచుకోవడం ద్వారా కావలసినంత టైం మిగులుతుంది. ఈ టైంను పుస్తకాలు చదవడానికి జ్ఞానాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించడానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలకు టైం విలువ తెలిసేటట్లు చెప్పాలి
దూరప్రాంతాలకు వెళ్ళవలసినప్పుడు ద్విచక్ర వాహనాలు కార్లు ట్రైన్ లేదా విమాన ప్రయాణం చెయ్యడం ద్వారా టైం మిగుల్చుకోవచ్చు మరియు వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు.
టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం వలన టైం డబ్బు కూడా ఆదా చెయ్యవచ్చు
కార్యక్రమాలు అనుకున్న టైంకు నిర్వహించడం ద్వారా అటు నిర్వాహకులు ఇటు సందర్శకులు సంతోషిస్తారు
జీవితం లో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే టైం మానేజ్మెంట్ తెలిసుండాలి. పంక్చవాలిటీ ఉన్నవాళ్ళకి సంఘములో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది
వంట చేసే ఆడవాళ్ళూ అన్ని సిద్ధంచేసుకుని వంట చేస్తే వంట తొందరగా పూర్తయి టైం చాల మిగులుతుంది. నేడు టీవీ లో సీరియల్స్ చూస్తూ ముఖ్యంగా ఆడవాళ్ళూ టైం వృధా చేస్తూ కుటుంబాన్ని పిల్లలను పట్టించుకోవడం తగ్గించేశారు పిజాలు బర్గర్లు హోటల్ నుండి ఆర్డర్ ఇస్తూ పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. క్లబ్బులు పబ్ లు పార్టీలంటూ యువతరం విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు
టైం తోనే జీవితం ముడిపడుందని గ్రహించి టైం కు విలువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మీ జీవితం నందనవనమవుతుంది
బి మల్లికార్జున దీక్షిత్
ఫామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్ 9133320425
