నిజం చెప్పాలంటే ఇప్పటికే ఈ పిలుపులు వినబడటం లేదు ఏదో అరుంధతి నక్షత్రం లాగా కొన్ని ఇళ్లల్లో వృద్ధదంపతుల మధ్య వినబడుతున్నాయి కాలం చెల్లిన రెండువేల రూపాయల నోటులాగా *ఇకముందు ఈ పిలుపులు వినిపించవు
ఏమండీ లేదా ఏవండీ
ఏమే ఒసేయ్
నాన్నగారు లేదా నాన్న (డాడీ గ మారింది)
అమ్మ (ముమ్మి గా మారింది)
బాబయ్య/మామయ్య (అంకుల్ గా మారింది) అమ్మక్క/పిన్ని/ దొడ్డ ( ఆంటీ గా మారింది)
అన్నం (నేడు రైస్)
మంచి నీరు (వాటర్ గ పిలుస్తున్నాం
కూర (కర్రీ అని పిలుస్తున్నాం)
చారు (రసం గా మారింది)
నేటి తరం ఎప్పటినుండో పై మాటలు మాట్లాడడం మర్చిపోయింది
ఇంకా కొన్నాళ్ళకి ఈ పేర్లు పెట్టి యెవరు పిలవరు ఎందుకంటె పిల్లలకు చాల సంవత్సరాల నుండి ఈ పేర్లు పెట్టడం మానేశారు (అన్ని రాయడం లేదు కొన్ని మాత్రమే)
సుబ్బారావు వెంకట్రావు పుల్లయ్య రామారావు సుబ్బయ్య అన్నపూర్ణ విశాలాక్షి పార్వతి సరస్వతి సుబ్బాయమ్మ వెంకమ్మ ఇంకా చాల వున్నాయి
దేవుడి పేర్లు కూడా ఏ పిల్లలకి పెట్టడం లేదు
నిజం చెప్పాలంటే ఇంట్లో పెద్దలకి నోరు తిరగని పేర్లు పిల్లలకు పెడుతున్నారు ఒకప్పుడు మనవడి పేరు వింటే తాత తాత పేరు గుర్తొచ్చింది ఇప్పుడు ఆ అవకాశమే లేదు
ఇలా రాసుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది జస్ట్ మీకు చెప్పాలనిపించి రాస్తున్నాను అంతే
బి. మల్లికార్జున దీక్షిత్