☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️
🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

03-02-2026 / మంగళవారం / రాశి ఫలితాలు

మేషం

ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.

మిధునం

కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

కర్కాటకం

ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం

వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

Advertisement

కన్య

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.

తుల

వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

వృశ్చికం

వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

ధనస్సు

గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.

మకరభం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement

🍁 శుభం భూయాత్ 🍀

తరచుగా అడిగే ప్రశ్నలు

03-02-2026 మంగళవారం మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి?

మేష రాశి వారికి ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుందని, వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయని, వ్యాపారాలలో ఆర్థిక లబ్ది ఉంటుందని ఆ రోజు ఫలితాలలో సూచించారు.

03-02-2026 న ఏ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయాలని సూచించారు?

వృషభ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని, తుల రాశి వారు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని సూచించారు. కర్కాటక రాశి వారికి ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయని చెప్పారు.

03-02-2026 న నిరుద్యోగులకు ఏ రాశుల్లో అనుకూల సూచనలు ఉన్నాయి?

మిధున రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉందని, కన్య రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయని సూచించారు. వృషభం, మీనం రాశుల వారి యత్నాలు మందగిస్తాయని చెప్పారు.

03-02-2026 న ఆరోగ్యం విషయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?

కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, మీన రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయని ఆ రోజు ఫలితాలలో సూచించారు.

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు ఎవరు అందించారు?

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలను ముక్తినూతలపాటి వాసు గారు అందించారు. మేషం నుండి మీనం వరకు రాశుల వారీగా వృత్తి, వ్యాపారం, ఆర్థికం, కుటుంబ విషయాల సూచనలు ఇందులో ఉన్నాయి.