☘️ ఈరోజు ఆమలకైకాదశి సందర్భంగా 👇

అశ్వమేధసహస్రస్య
యత్ఫలం లభతే నరః |
తత్ఫలం లభతే సర్వం
ఆమలక్యా ఉపవాసతః ||

Advertisement

ఈ ఆమలకీ ఏకాదశి నాడు
ఉపవాసం ఉన్నవారు వెయ్యి
అశ్వమేధ యాగాలు చేసినంత
పుణ్యఫలాన్ని పొందుతారు.

"ఆమలకి మహాపుణ్యే
బ్రహ్మపుత్రి నమోఽస్తు తే |
సర్వపాపహరే దేవి
ప్రీత్యర్థం వాసుదేవస్య ||

Advertisement

"ఓ మహా పుణ్యప్రదమైన
ఆమలకి! బ్రహ్మదేవుని నుండి
ఉద్భవించిన నీకు నమస్కారం.
శ్రీమహావిష్ణువు ప్రీతి కోసం మా
పాపాలను హరించి అనుగ్రహించు.

కురుక్షేత్రే రవిగ్రాహే
యత్ఫలం స్నానదానతః |
తస్మాదష్టగుణం పుణ్యం
ఆమలక్యాః ఉపవాసతః ||

సూర్యగ్రహణ సమయంలో
కురుక్షేత్రంలో స్నాన దానాలు చేస్తే
ఎంత పుణ్యం లభిస్తుందో, దానికి
ఎనిమిది రెట్ల పుణ్యం ఈ ఆమలకీ
ఏకాదశి ఉపవాసం వల్ల లభిస్తుంది.

Advertisement

అమలక్యం మహాపుణ్యం
సర్వపాప వినాశనం |
సర్వదేవమయం వృక్షం
నమామి త్వాం జగత్పతిమ్ ||

అత్యంత పుణ్యప్రదమైనది, సర్వ
పాపాలను నశింపజేసేది, సర్వ
దేవతలకు నిలయమైనది
మరియు జగత్పతి స్వరూపమైన
ఓ ఉసిరి వృక్షమా! నీకు
నమస్కరిస్తున్నాను.

అశ్వత్థరూపీ భగవాన్
విష్ణురేవ న సంశయః |
ధాత్రీరూపీ స ఏవాసౌ
మాధవః క్లేశనాశనః ||

అశ్వత్థ (రావి) వృక్షం ఏ విధంగా
విష్ణు స్వరూపమో, ధాత్రీ (ఉసిరి)
వృక్షం కూడా సాక్షాత్తు క్లేశాలను
హరించే మాధవ స్వరూపమే.

Advertisement

యాని కాని చ పాపాని
బ్రహ్మహత్యాదికాని చ |
తాని సర్వాణి నశ్యంతి
ఆమలక్యాః ప్రతాపతః ||

బ్రహ్మహత్యా పాతకం వంటి
ఘోరమైన పాపాలు సైతం ఈ
ఆమలకీ ఏకాదశి వ్రతం చేయడం
వల్ల నశిస్తాయి.

ఆమలకీ మహాపుణ్యే
పాపఘ్నీ హరివల్లభే |
గృహాణార్ఘ్యం మయా దత్తం
సర్వపాపహరీ భవ ||

ఓ మహా పుణ్యప్రదమైన,
పాపాలను హరించే, శ్రీహరికి
అత్యంత ప్రియమైన ఆమలకీ
వృక్షమా! నేను ఇచ్చే ఈ అర్ఘ్యాన్ని
స్వీకరించి, నా సర్వ పాపాలను
తొలగించుము.

ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడమే కాకుండా, వీలైతే ఉసిరి చెట్టు కింద ద్వాదశి భోజనం చేయడం, ద్వాదశి ఉసిరి పదార్థాలను తినడం కూడా విశేష ఫలితాన్నిస్తుంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏