🍁 తాము‌ బాపనోళ్ళకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే...
అనేది అసలు సమస్య

అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

బాపడు పూజ చేస్తే - సమస్య.
వాళ్ళే ఎందుకు చెయ్యాలని.

క్రికెట్ ఆడితే - సమస్య.
(క్రికెట్ లో ఎక్కువమంది బ్రాహ్మలని ఒక ఏడుపు ఉంది)

మిలట్రీలో చేరితే - సమస్య. (ఐలయ్య)
మిలట్రీలో చేరకుంటే - సమస్య.
(తిని కూర్చుంటున్నారని ఏడుపు)

విదేశీ సంస్థల్లో ఉన్నతాధికారిలైతే - సమస్య.
(సుందర్ పిచ్చయ్య వగైరాలను చూసి)

రాజులుగా ఉండి ఉంటే - సమస్య.
రాజులుగా ఉండకపోతేనూ - సమస్య.

కవిత్వం వ్రాస్తే - సమస్య.
వ్రాయకుంటే - సమస్య.

వేదం చదివితే - సమస్య.
(ఎవరికీ నేర్పలేదని, జ్ఞానం అంతా దాచుకున్నారని ఏడుపు)

వేదం నేర్పుతే - సమస్య.
(ఏదీ లేని పుక్కిటి పురాణ వేదాలను ప్రోస్తహిస్తూ, వలసార్య పెత్తనాన్ని పెంచి పోషిస్తున్నారనని ఏడుపు)

బాపడు వేదం చదవకపోతే - సమస్య.

మంత్రజపం చేస్తే - సమస్య.
(మాకు నేర్పలేదని)

చెయ్యకుంటే - సమస్య.
(ముక్కు మూసుకుని మంత్ర జపము వదిలేసి మా పనుల్లో దూరుతున్నావని)

విద్య నేర్పితే - సమస్య.
(ఏకలవ్యుడికి నేర్పలేద్!)

నేర్పితేనూ - సమస్య.
(వాడికే నేర్పావు అని)

తోచిన మంచి చెబితే - సమస్య.
(మనువాదం అని)

చెప్పకుంటే - సమస్య.
(ఏమీ చెప్పలేనోడు బ్రాహ్మడెలా అయితివి)

చాణుక్యుడిలా రాజ్యం కాపాడితే - సమస్య.
(వాడిని ఎక్కిస్తివి అని)

కాపాడకుంటే - సమస్య.
(నువ్వే కదా మంత్రివి. నీ డ్యూటీ అది కాదా?)

అర్చకత్వం చేస్తే - సమస్య
(మాకా పోస్ట్ ఈలేదే)

చెయ్యకుంటే - సమస్య.
(నీకు బలిసింది. డబ్బులు రావని ఆ ప్రొఫెషన్ వదిలేస్తివి)

శాకాహారం తింటే - సమస్య.
తినకుంటే - సమస్య.

ఒక్కమాటలో చెప్పాలంటే - బాపడు
ఏం చేసినా సమస్య!
ఏమ్ చెయ్యకున్నా సమస్య. 🙂

Advertisement

లేటెస్ట్ మరో కొంపలు మునిగే సమస్య -
దురంధర్ తీసిన వాడు బ్రాహ్మడు. 😀

బ్రాహ్మడు సినిమా తీస్తే - సమస్య.
(బత్తాయి ఒలిచి తినిపిస్తున్నావు అని. 😀)

తీకుంటే - సమస్య.
నీకు రాదు అని.

తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృహ్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే...
అనేది అసలు సమస్య

అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

#బాకీసబ్_బక్వాస్


Source: Harathi Srinivasa Dikshit garu

తరచుగా అడిగే ప్రశ్నలు

బ్రాహ్మణులపై విమర్శల్లో విరుద్ధత ఏమిటి?

బ్రాహ్మణుడు ఒక పని చేసినా సమస్య, చేయకపోయినా సమస్య అని చూపడమే ఈ విమర్శల్లోని విరుద్ధత. ఉదాహరణకు వేదం చదివితే జ్ఞానం దాచుకున్నారని, చదవకపోతే మరో విధంగా విమర్శిస్తారని రచయిత వ్యంగ్యంగా చెప్పారు.

వేదం, విద్య నేర్పడంపై ఎలాంటి విమర్శలు వస్తాయి?

విద్య నేర్పకపోతే ఏకలవ్యుడికి నేర్పలేదని, నేర్పితే వాడికే నేర్పావని విమర్శ వస్తుందని రచయిత పేర్కొన్నారు. వేదం నేర్పినా, నేర్పకపోయినా విమర్శ తప్పదని వ్యంగ్యంగా చెప్పారు.

అర్చకత్వం, మంత్రజపం విషయంలో ఉన్న ద్వంద్వ వైఖరి ఏమిటి?

అర్చకత్వం చేస్తే తమకు ఆ పోస్ట్ ఇవ్వలేదని, చేయకపోతే డబ్బులు రావని వదిలేశారని విమర్శిస్తారని రచయిత చెప్పారు. మంత్రజపం చేసినా, మానేసినా అదే విధమైన విమర్శ ఎదురవుతుందని పేర్కొన్నారు.

సినిమా, క్రికెట్ వంటి రంగాల ప్రస్తావన ఎందుకు వచ్చింది?

క్రికెట్‌లో ఎక్కువమంది బ్రాహ్మణులు ఉన్నారని, దురంధర్ సినిమా తీసిన వ్యక్తి బ్రాహ్మణుడని కూడా విమర్శలు వస్తున్నాయని రచయిత వ్యంగ్యంగా ఉదహరించారు. ఆధునిక రంగాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోందని ఆయన అభిప్రాయం.

ఈ వ్యంగ్య రచన ఎవరిది, అందులోని అసలు సందేశం ఏమిటి?

ఈ రచనకు మూలం హారతి శ్రీనివాస దీక్షిత్ గారు. ఎన్ని సమస్యలు సృష్టించినా బ్రాహ్మణుడు ఏడవకపోవడమే విమర్శకుల అసలు సమస్య, దాన్ని నేరుగా అనలేకపోవడం మరో సమస్య అని ఆయన ముగించారు.