దానం ధర్మం – కష్టార్జిత ధనంతో చేసిన దానమే పుణ్యప్రదం

🌻🍀🍁🍁🍀🌻🍀🌻🍁 నీ కష్టార్జిత సొమ్ముతోనే దానము చేయుము స్వయముగా, న్యాయముగా శ్రమపడి సంపాదించి, మంచివారికి దానముచేసిన మాత్రమే మనకు పూర్తిగా దాన ఫలితము కలుగును, తల్లిదండ్రాదులు బంధుమిత్రుల సొమ్ముతోగాని, ఇతరు లిచ్చిన సొమ్ముతోగాని, వడ్డీవ్యాపారముతో ఆర్జించిన సొమ్ముతో గాని, అద్దెలు వలనగాని, అధిక లాభమువేసికొని వ్యాపారము చేసిగాని -సంపాదించి దాన ధర్మాది పుణ్యకార్యములను చేసినచో దాతకు పూర్తిగా పుణ్యము రాదు…. శ్లో.
🌻🍀🍁🍁🍀🌻🍀🌻🍁
నీ కష్టార్జిత సొమ్ముతోనే దానము చేయుము
స్వయముగా, న్యాయముగా శ్రమపడి సంపాదించి, మంచివారికి దానముచేసిన మాత్రమే మనకు పూర్తిగా దాన ఫలితము కలుగును,
తల్లిదండ్రాదులు బంధుమిత్రుల సొమ్ముతోగాని, ఇతరు లిచ్చిన సొమ్ముతోగాని, వడ్డీవ్యాపారముతో ఆర్జించిన సొమ్ముతో గాని, అద్దెలు వలనగాని, అధిక లాభమువేసికొని వ్యాపారము చేసిగాని -సంపాదించి దాన ధర్మాది పుణ్యకార్యములను చేసినచో దాతకు పూర్తిగా పుణ్యము రాదు….
శ్లో. రాగాద్యుపగతే చిత్తే,
వంచయిత్వా పరంధనమ్
యదర్ష్యతే తస్య దానా,
ద్యస్యార్థాస్తస్య తత్ఫలమ్||
తా|| రాగద్వేషాది గుణములతో ఇతరులను మోసగించి సంపాదించిన ధనమును పుణ్యకార్యములకు ఉపయో గించినచో వానివలన వచ్చిన పుణ్యము ధనమునకు కర్త యైన వారికే చేరును, దానము చేసిన వానికి పుణ్యము రాదు,
{ గృహస్థ ధర్మావళి - యోగ వాసిష్ఠము )
తరచుగా అడిగే ప్రశ్నలు
ఏ ధనంతో దానం చేస్తే పూర్తి దాన ఫలితం కలుగుతుంది?
స్వయముగా, న్యాయముగా శ్రమపడి సంపాదించిన కష్టార్జిత ధనంతో మంచివారికి దానం చేసినప్పుడే పూర్తి దాన ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
ఏ సొమ్ముతో దానం చేస్తే పూర్తి పుణ్యం రాదు?
తల్లిదండ్రులు, బంధుమిత్రుల సొమ్ము, ఇతరులు ఇచ్చిన సొమ్ము, వడ్డీవ్యాపారం, అద్దెలు, అధిక లాభం వేసుకుని చేసిన వ్యాపారంతో ఆర్జించిన సొమ్ముతో దానం చేస్తే దాతకు పూర్తిగా పుణ్యం రాదు.
మోసం చేసి సంపాదించిన ధనంతో దానం చేస్తే పుణ్యం ఎవరికి చేరుతుంది?
రాగద్వేషాలతో ఇతరులను మోసగించి సంపాదించిన ధనాన్ని పుణ్యకార్యాలకు వాడితే, ఆ పుణ్యం ధనానికి అసలు కర్త అయిన వారికే చేరుతుంది. దానం చేసిన వ్యక్తికి ఆ పుణ్యం రాదు.
దానం ఎవరికి చేయాలి?
న్యాయంగా శ్రమపడి సంపాదించిన ధనాన్ని మంచివారికి దానం చేయాలి. అలా చేసిన దానమే దాతకు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది.
కష్టార్జిత ధనంతో దానం అనే బోధ ఏ గ్రంథాల నుండి వచ్చింది?
ఈ బోధ గృహస్థ ధర్మావళి, యోగ వాసిష్ఠము నుండి ఉదహరించబడింది. "రాగాద్యుపగతే చిత్తే" అనే శ్లోకం మోసంతో వచ్చిన ధనంతో చేసిన దానం గురించి వివరిస్తుంది.




