చంద్రగ్రహణం – ఎప్పుడు? ఎవరు చూడవచ్చు?

తేదీ: 7 సెప్టెంబర్ 2025, ఆదివారంపౌర్ణమి: భాద్రపదమాస పౌర్ణమిసమయం: రాత్రి 9:54 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:26 నిమిషాల వరకు (మొత్తం 3 గంటల 30 నిమిషాలు)గ్రహణం: రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణంకనిపించే ప్రదేశం: భారతదేశం అంతట జ్యోతిష్య వివరాలు ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది.
తేదీ: 7 సెప్టెంబర్ 2025, ఆదివారం
పౌర్ణమి: భాద్రపదమాస పౌర్ణమి
సమయం: రాత్రి 9:54 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:26 నిమిషాల వరకు (మొత్తం 3 గంటల 30 నిమిషాలు)
గ్రహణం: రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం
కనిపించే ప్రదేశం: భారతదేశం అంతట
జ్యోతిష్య వివరాలు
- ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది.
- శతభిషా నక్షత్రం మరియు పూర్వాభాద్ర నక్షత్రం వారు గ్రహణం చూడకూడదు.
- ఈ రెండు నక్షత్రాలకు మాత్రమే దోషం ఉంటుంది.
- గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణాన్ని చూడకూడదు.
ఆచార నియమాలు
- రాత్రి 7:30 లోపే భోజనం చేయాలి.
- ఆ తర్వాత ఏదీ తినరాదు.
- మరుసటి రోజు ఉదయం ఇంటిని శుద్ధి చేసి దేవుని పూజ చేయాలి.
దోష నివారణ & గ్రహణ శాంతి
శతభిషా మరియు పూర్వాభాద్ర నక్షత్రం వారు చేయవలసింది:
- దేవాలయానికి వెళ్లాలి.
- కేజీ పావు మినుములు, కేజీ పావు బియ్యం తీసుకోవాలి.
- చంద్రుడు, సర్ప విగ్రహాలు వెండితో చేయించి ఒక మట్టిమూకుడులో నెయ్యి పోసి పెట్టాలి.
- బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానం ఇవ్వాలి.
కుంభరాశివారు తప్పక చేయాలి.
ఇతర రాశివారికి ఎటువంటి ఇబ్బంది లేదు.
ముఖ్య గమనికలు
- యూట్యూబ్, వాట్సాప్ లలో కనిపించే చిత్రవిచిత్రమైన వాదనలు నమ్మకండి. అవి లైకులు కోసం చేసే స్టంట్లు మాత్రమే.
- 7వ తేదీ రాత్రి అన్ని ఆలయాలు మూసివేస్తారు (కాళహస్తి వంటి కొన్ని క్షేత్రాలు మినహాయించి).
- మరుసటి రోజు శుద్ధి అనంతరం ఆలయ దర్శనాలు ప్రారంభమవుతాయి.
అపోహలు నమ్మకండి. భయపడకండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం ఎప్పుడు, ఏ సమయంలో ఏర్పడింది?
7 సెప్టెంబర్ 2025, ఆదివారం భాద్రపదమాస పౌర్ణమి నాడు రాత్రి 9:54 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది భారతదేశం అంతట కనిపించింది.
ఈ చంద్రగ్రహణాన్ని ఎవరు చూడకూడదు?
గ్రహణం కుంభరాశిలో జరిగింది. శతభిషా, పూర్వాభాద్ర నక్షత్రాల వారు, గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదని సూచించారు; దోషం ఈ రెండు నక్షత్రాలకు మాత్రమే అని పేర్కొన్నారు.
చంద్రగ్రహణం రోజు భోజన నియమాలు ఏమిటి?
ఆచార నియమాల ప్రకారం రాత్రి 7:30 లోపే భోజనం చేయాలి, ఆ తర్వాత ఏదీ తినరాదు. మరుసటి రోజు ఉదయం ఇంటిని శుద్ధి చేసి దేవుని పూజ చేయాలి.
శతభిషా, పూర్వాభాద్ర నక్షత్రాల వారు గ్రహణ శాంతి ఎలా చేయాలి?
దేవాలయానికి వెళ్లి కేజీ పావు మినుములు, కేజీ పావు బియ్యం తీసుకోవాలి. వెండితో చేయించిన చంద్రుడు, సర్ప విగ్రహాలను నెయ్యి పోసిన మట్టిమూకుడులో పెట్టి, బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానం ఇవ్వాలి.
కుంభరాశి వారు కూడా గ్రహణ శాంతి చేయాలా?
కుంభరాశి వారు గ్రహణ శాంతి తప్పక చేయాలని సూచించారు. ఇతర రాశుల వారికి ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.
గ్రహణం రాత్రి ఆలయాలు తెరిచి ఉంటాయా?
7వ తేదీ రాత్రి కాళహస్తి వంటి కొన్ని క్షేత్రాలు మినహా అన్ని ఆలయాలు మూసివేస్తారని తెలిపారు. మరుసటి రోజు శుద్ధి అనంతరం ఆలయ దర్శనాలు ప్రారంభమవుతాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సమాచారం మరియు సేకరణ నుంచి మరిన్ని
- ప్రధాన అర్చకులు కావలెను – చాణక్యపురి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, సికింద్రాబాద్
- జ్యేష్ఠ మాసం 2026: ప్రారంభ తేదీ, ముగింపు తేదీ, పూర్తి పండుగల జాబితా & ముఖ్య తేదీలు
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం
- నేనే కామాక్షి: కంచి పరమాచార్య స్వామివారి దివ్య దర్శన అనుభవం
- భీష్మాష్టమి & రిపబ్లిక్ డే 2026: జనవరి 26 పంచాంగ విశేషాలు




