బి. మల్లికార్జున దీక్షిత్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
913320425


Advertisement

ప్రేమ.
ఈ మాట... ఎంత తియ్యగా ఉంటుంది!
ఈ మాట వినగానే హృదయం ఎంతగానో పులకిస్తుంది.

అసలు ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా?

Advertisement

ఒక మహిళ వైద్యుడి దగ్గరకు వెళ్ళినపుడు,
"మీరు గర్భవతివి" అని విన్న వెంటనే
ఆమె మనసులో ఒక అపూర్వమైన, తెలియని అనిర్వచనీయమైన అనుభూతి మేలుకొంటుంది.
ఆమె చేతులు తానుగా పొట్టమీదకి వెళ్తాయి.
అక్కడే మొదలవుతుంది ప్రేమ.

ఆ క్షణమే ఆమెకు తెలుసుతుంది –
తాను తల్లి కాబోతున్నాను,
తనలో మరో జీవం పెరుగుతోంది.
ఇప్పటికే ఆ జీవంతో అనుబంధం ఏర్పడుతుంది.
ఇప్పటికే ప్రేమ మొలకెత్తుతుంది.

మనకు తెలియకుండానే, మనం పిండదశలో ఉన్నప్పుడే,
మన తల్లి మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది.
అదే ప్రేమకు తొలి బీజం.
అది ప్రేమకు ఆది అంకురం.

Advertisement

ఆ క్షణం నుండి ప్రసవం వరకు,
ఆమె తనకు నచ్చని ఆహారాన్ని కూడా మన కోసమే తింటుంది.
పండ్లు, పొలాలు, మందులు, ఇంజెక్షన్లు, పరీక్షలు...
ఏదైనా భరించగలదు – మనం ఆరోగ్యంగా ఉండాలనే ఆశతో.

ఆమె బాధలో కన్నీళ్లు వచ్చినా,
మన కోసం పొట్టను ముద్దగా తాకుతూ
మన క్షేమాన్ని కోరుతుంది.
ఆమె ఊహల్లో మనమే.

తన శరీరాన్ని తానే మరిచి, మన కోసం అష్టకష్టాలు భరిస్తుంది.
ప్రసవ నొప్పుల బాధను ఎదుర్కొంటుంది.
తన జీవితం రిస్క్‌లో పెట్టి మనకు జీవితం ఇస్తుంది.

Advertisement

ఈ విశ్వంలో ఎలాంటి కలుషితతలేని, స్వచ్ఛమైన, నిస్వార్థమైన, నిజమైన ప్రేమ ఒకటే ఉంటుంది.
అదే తల్లి ప్రేమ.

మనకు మనమే ఎవరం, ఆడామగాలేమో తెలియని వయస్సులోనుండే
మన తల్లి మనల్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.
అందుకే...
మన జీవితంలో మొదటి ప్రేమ – తల్లిదే!

అది మనం పొందిన మొదటి ప్రేమ.
అది ఎప్పటికీ మరచిపోలేని ప్రేమ.


– బి. మల్లికార్జున దీక్షిత్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 913320425