పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం???

ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు… ఇలా అడిగాడు.
ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు… ఇలా అడిగాడు..
నేను ఎందుకు పేదవాడను?
బుద్ధుడు సమాధానం చెప్పాడు:
మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు,
నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..
అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు
మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!…
మొదట మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం …ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది …
రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు ..
ఇది నిజం… మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు … వాటిని మంచి అనుభూతితో చేయండి…
మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి … వాటిని విలువైనదిగా భావించండి ..
దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి …
నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది….
మీ దయగల హృదయంతో , భగవంతున్ని ప్రార్థిస్తూ … మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు … ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు… వారి జీవితాలను తాకవచ్చు…
మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం ….
ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు … అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు….
సహాయం చెయ్యడానికి డబ్బు అవసరం లేదు ..
ఒక చిన్న శ్రద్ధ , సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు…
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత .
తరచుగా అడిగే ప్రశ్నలు
పేదవాడు ఎందుకు పేదవాడని బుద్ధుడు చెప్పాడు?
ఔదార్యం లేకపోవడం, దాన ధర్మాలు చేయకపోవడమే పేదరికానికి కారణమని బుద్ధుడు ఆ పేదవాడికి సమాధానం చెప్పాడు.
బుద్ధుడు చెప్పిన ఐదు నిధులు ఏవి?
ప్రతి మనిషికీ ముఖం, కళ్ళు, నోరు, హృదయం, శరీరం అనే ఐదు నిధులు ఉన్నాయని బుద్ధుడు చెప్పాడు. వీటిని ఇతరులతో పంచుకోవడానికి డబ్బు అవసరం లేదు.
ముఖం, కళ్ళతో ఇతరులకు ఎలా దానం చేయవచ్చు?
ముఖంతో ఇతరులతో నవ్వులను పంచుకోవచ్చు, ఇది ఉచితం మరియు అద్భుతమైన ప్రభావం చూపుతుంది. కళ్ళతో ప్రేమ, శ్రద్ధతో ఇతరులను చూడటం ద్వారా వారికి మంచి అనుభూతిని కలిగించవచ్చు.
నోరు, హృదయంతో ఇతరులకు ఎలా మేలు చేయవచ్చు?
నోటితో ఇతరులకు మంచి విషయాలు చెప్పి, సత్సంగంలో చేర్పించి ఆనందాన్ని, సానుకూలతను వ్యాప్తి చేయవచ్చు. దయగల హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు.
సహాయం చేయడానికి డబ్బు అవసరమా?
సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు. శరీరంతో అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు, ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు కూడా జీవితాలను వెలిగించగలవు.
మానవ జన్మకు సార్థకత ఏమిటి?
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…
- సాధకుడు – సంసారం



