పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది!

అయితే ఎందుకో ఈ పద్యం సామాన్యుల మధ్య బహుళంగా ప్రచారం కాలేదు!

కార్యేషు యోగీ, కరణేషు దక్షః,
రూపేచ కృష్ణః, క్షమయాతు రామః,
భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం,
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
(కామందక నీతిశాస్త్రం)


1️⃣ కార్యేషు యోగీ

పనులను యోగిలా చేయాలి. ఫలితాల పట్ల ఆశ లేకుండా, కర్తవ్యం అనిపించుకొని శ్రద్ధగా చేయాలి.

2️⃣ కరణేషు దక్షః

కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో, జీవిత నిర్ణయాలు తీసుకునే విషయాల్లో సమర్థుడిగా, దక్షతతో వ్యవహరించాలి.

3️⃣ రూపేచ కృష్ణః

బాహ్య రూపంలో కాక, హావభావాల్లో, ఉత్సాహం, నవ్వుతో, మాధుర్యంతో జీవించాలి. ఇది శ్రీకృష్ణుని గుణం.

4️⃣ క్షమయా తు రామః

శాంతం, ఓర్పు, క్షమ – ఇవి శ్రీరాముని లక్షణాలు. మనుషుల్లో తప్పులు సహజం. వాటిని ఓర్పుతో మింగివేయగలగాలి.

5️⃣ భోజ్యేషు తృప్తః

తల్లి లేదా భార్య వంటను సంతోషంగా, వంకలు పెట్టకుండా స్వీకరించాలి. కృతజ్ఞత భావంతో ఉండాలి.

6️⃣ సుఖదుఃఖ మిత్రం

కుటుంబం ఆనందంలో ఉన్నప్పుడు పంచుకునే హర్షమే కాదు, కష్ట సమయంలో అండగా నిలిచే భుజమూ కావాలి.


ఈ "షట్కర్మాలు" (ఆరు కర్మలు)

ఈ విధంగా జీవించగలిగే పురుషుడే నిజమైన ధర్మనాథుడు.
అతనే కుటుంబానికి శ్రేయస్సు, సమాజానికి ఆదర్శం.


కళ్యాణమస్తు

ఆధ్యాత్మికతే బ్రహ్మానందానికి మూలం
తెలుగు సంస్కృతి – నీతి బోధలు – సత్ప్రవర్తనకు మార్గదర్శకాలు

తరచుగా అడిగే ప్రశ్నలు

"కార్యేషు యోగీ, కరణేషు దక్షః" పద్యం ఏ గ్రంథంలోనిది?

ఈ పద్యం కామందక నీతిశాస్త్రం నుండి తీసుకోబడింది. పురుషుడు ఎలా ఉండాలో చెప్పే ఈ ధర్మశాస్త్ర వచనం సామాన్యుల మధ్య బహుళంగా ప్రచారం కాలేదు.

"కార్యేషు యోగీ" అంటే అర్థం ఏమిటి?

పనులను యోగిలా చేయాలి అని అర్థం. ఫలితాల పట్ల ఆశ లేకుండా, కర్తవ్యంగా భావించి శ్రద్ధగా పని చేయాలి.

"రూపేచ కృష్ణః", "క్షమయా తు రామః" అంటే ఏమిటి?

రూపేచ కృష్ణః అంటే బాహ్య రూపంలో కాక హావభావాల్లో ఉత్సాహం, నవ్వు, మాధుర్యంతో జీవించడం — ఇది శ్రీకృష్ణుని గుణం. క్షమయా తు రామః అంటే శ్రీరాముని వలె శాంతం, ఓర్పు, క్షమతో ఇతరుల తప్పులను భరించడం.

"భోజ్యేషు తృప్తః" ప్రకారం పురుషుడు ఎలా ఉండాలి?

తల్లి లేదా భార్య వంటను సంతోషంగా, వంకలు పెట్టకుండా స్వీకరించాలి. కృతజ్ఞత భావంతో ఉండాలి.

"సుఖదుఃఖ మిత్రం" అంటే ఏమిటి?

కుటుంబం ఆనందంలో ఉన్నప్పుడు హర్షాన్ని పంచుకోవడమే కాదు, కష్ట సమయంలో అండగా నిలిచే భుజంగా కూడా ఉండాలి అని అర్థం.

ధర్మనాథుడు అని ఎవరిని అంటారు?

కార్యేషు యోగీ నుండి సుఖదుఃఖ మిత్రం వరకు ఈ ఆరు కర్మలను (షట్కర్మాలు) పాటిస్తూ జీవించే పురుషుడే నిజమైన ధర్మనాథుడు. అతనే కుటుంబానికి శ్రేయస్సు, సమాజానికి ఆదర్శం.