భార్యాభర్తల ప్రేమకథ

ఒక చిన్న ఆట... ఒక గొప్ప విజయం! అర్థం చేసుకున్న ప్రేమే నిజమైన సంపద ఒక దంపతులు… ప్రతిరోజూ మాటల తోటల్లో పోట్లాడే భార్యాభర్తలు.భర్త చిన్న ఉద్యోగి, ఓ సాదాసీదా మనిషి. కానీ భార్య మాత్రం… "పక్కింట్లో వాళ్లు ఫ్రిజ్ తెప్పించుకున్నారు…""ఎదిరింటి వారు
ఒక చిన్న ఆట... ఒక గొప్ప విజయం!
అర్థం చేసుకున్న ప్రేమే నిజమైన సంపద
ఒక దంపతులు… ప్రతిరోజూ మాటల తోటల్లో పోట్లాడే భార్యాభర్తలు.
భర్త చిన్న ఉద్యోగి, ఓ సాదాసీదా మనిషి. కానీ భార్య మాత్రం…
"పక్కింట్లో వాళ్లు ఫ్రిజ్ తెప్పించుకున్నారు…"
"ఎదిరింటి వారు కొత్త కార్ కొన్నారు…"
"వెనకింటి వారు విదేశాలకు వెళ్ళారు…" అని ఏదో ఒక కోరిక, ఏదో ఒక అర్ధం…
భర్త ఎన్నిసార్లు చెప్పాడు:
"నాకు సాధ్యమవ్వదు బంగారం… మన దగ్గర ఉన్నదాన్లో సంతృప్తిగా ఉండాలి."
కానీ భార్యకు అవేవీ అర్ధం కాలేవు…
కాలం గడుస్తోంది…
ఒకరోజు చుట్టాల్లో పెళ్లి.
వీళ్లు కూడా వెళ్లారు. భార్య అప్పుడే భర్తపై కోపంగా ఉంది – "నాకు పట్టు చీర తెచ్చి ఇవ్వలేదని"…
పెళ్లిలో సరదాగా ఒక ఆట ప్రకటించారు:
దంపతులు పాల్గొనాలి… గెలిచిన వారికి ₹20,000 బహుమతి!
ఆట ఏంటంటే?
భార్యను భర్త ఎత్తుకొని కుర్చీ మీద కూర్చోపెట్టాలి – మరలా దింపాలి.
కుర్చీలు ఒకదానిపై ఒకటి వేసి వెళ్తారు… అంతే!
ఆట మొదలైంది.
1వ కుర్చీ… 2వ కుర్చీ…
3, 4, 5…
భర్త తన శక్తికి మించిన శ్రమతో భార్యను ఎత్తి కూర్చోపెడుతున్నాడు.
8, 9, 10…
ఇప్పటికే భర్త శరీరం చెమటలు చిందిస్తోంది.
అయినా ఆగలేదు.
కళ్ళలో కన్నీళ్లు… అయినా ఆ ప్రయత్నం ఆపలేదు.
తన కోసం ఇంతగా కష్టపడుతున్న భర్తను చూసిన భార్యకి కళ్లెదుటే సత్యం నాట్యం చేసింది.
"ఇంతకాలం నా కోరికల పేరుతో ఆయన మనసు పిండేశానని నాకిప్పుడే అర్ధమైంది…"
"నన్ను అర్ధం చేసుకున్న భర్తను నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు…"
ఆ ఆట ముగిసింది.
₹20,000 బహుమతి ప్రకటించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ చెప్పారు:
"ఈ ఆటలో గెలుపూ ఓటమీలేదు… భార్య ఉన్న భర్త విజేత… భర్త ఉన్న భార్య విజేత… వారి ప్రేమే నిజమైన గెలుపు!"
కానీ… భార్య ఆ డబ్బు తీసుకోలేదు.
ఆమె మాటలు ఇలా:
"ఈ డబ్బుల కోసమే నా భర్తను బాధించాను… కానీ ఇప్పుడే తెలిసింది – ఆయన ప్రేమే నిజమైన విలువ!
ఇవాళ వాడిని పొందినదే నిజమైన బహుమతి!"
అప్పటి నుండి ఆమె తన భర్తను ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ప్రేమించసాగింది.
ఇంటి చిన్నచిన్న గొడవలు ఉంటే ఉండొచ్చు… కానీ "నాకిది కావాలి, అది కావాలి" అనే కోరికలు మాయమయ్యాయి.
ఈ చిన్న సంఘటన –
ఒక కుటుంబాన్ని కొత్తగా తయారుచేసింది,
ఒక ప్రేమను పదిలంగా నిలిపింది,
ఒక జీవితాన్ని అర్థవంతంగా మార్చింది.
ఇలాంటి సంఘటనలు మన కుటుంబాలలో ప్రేమ, క్షమ, సహనాలకు గుర్తుగా నిలిచిపోతాయి. మన మనసుల్లో ప్రేమ పరిపుష్టిగా ఉండాలంటే – అర్థం చేసుకోవడమే మొదటి అడుగు!
తరచుగా అడిగే ప్రశ్నలు
పెళ్లిలో దంపతులకు పెట్టిన ఆట ఏమిటి?
భర్త భార్యను ఎత్తుకొని కుర్చీ మీద కూర్చోపెట్టి మళ్లీ దింపాలి, కుర్చీలను ఒకదానిపై ఒకటి పెంచుతూ వెళ్తారు. గెలిచిన దంపతులకు ₹20,000 బహుమతి ప్రకటించారు.
భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏమిటి?
భర్త చిన్న ఉద్యోగి అయినా, పక్కింటివారి ఫ్రిజ్, ఎదురింటివారి కొత్త కారు, విదేశీ ప్రయాణాలు చూసి భార్య ఎప్పుడూ ఏదో ఒక కోరిక కోరేది. మన దగ్గర ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలని భర్త చెప్పినా ఆమెకు అర్థం కాలేదు.
భార్య బహుమతి డబ్బును ఎందుకు తీసుకోలేదు?
తన కోసం భర్త శక్తికి మించి కష్టపడటం చూసి, డబ్బుల కోసమే భర్తను బాధించానని ఆమె గ్రహించింది. భర్త ప్రేమే నిజమైన విలువ, నిజమైన బహుమతి అని చెప్పి ఆ డబ్బును తిరస్కరించింది.
ఆట నిర్వాహకులు విజేత గురించి ఏమన్నారు?
ఈ ఆటలో గెలుపూ ఓటమీ లేదని, భార్య ఉన్న భర్త విజేత, భర్త ఉన్న భార్య విజేత అని, వారి ప్రేమే నిజమైన గెలుపు అని నిర్వాహకులు చెప్పారు.
దాంపత్యంలో ప్రేమ నిలవాలంటే మొదటి అడుగు ఏమిటి?
మనసుల్లో ప్రేమ పరిపుష్టిగా ఉండాలంటే జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడమే మొదటి అడుగు. ప్రేమ, క్షమ, సహనాలే కుటుంబాన్ని నిలబెడతాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- నవగోప్య విషయాలు
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…



