పరీక్ష రోజు ఇలా చేయండి..

ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవండి. ఒక గంట పాటు తప్పక చదవండి.
- ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవండి.
- ఒక గంట పాటు తప్పక చదవండి.
- కాలకృత్యాలు తీర్చుకోండి.
- మీకు ఉత్సాహాన్ని ఇచ్చే బట్టలు ధరించండి.
- వీలైతే వాచ్ పెట్టుకోండి.
- అల్పాహారం విషయంలో జాగ్రత్త:
- ఇడ్లీ, పొంగల్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి.
- నూనెలో వేయించిన వడలు, బోండాలు, దోశ, పూరి వంటి వాటికి దూరంగా ఉండండి.
- అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోండి:
- హాల్ టికెట్, ప్యాడ్, రెండు పెన్నులు, స్కేలు, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్, మంచినీటి బాటిల్, చేతి గడ్డ, సరిపడినంత డబ్బులు.
- పరీక్షకు వెళ్లే ముందు:
- కొంతమంది పరీక్ష కేంద్రానికి వెళ్లేంత వరకు చదువుతూనే ఉంటారు. ఇలా చేయవద్దు.
- పరీక్షకు బయలుదేరే గంట ముందు చదవడం ఆపి ప్రశాంతంగా ఉండండి.
- పరీక్ష కేంద్రానికి గం. 8:30 నాటికి (తొలి రోజు అయితే గంట ముందే) చేరుకోండి.
- మీకు కేటాయించిన రూమ్, మీ సీటింగ్ సరిచూసుకోండి.
- పరీక్ష హాల్లోకి వెళ్లేముందు:
- కాలకృత్యాలు తీర్చుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో హాల్లోకి వెళ్లండి.
- రిలాక్స్ గా కూర్చొని రెండు, మూడుసార్లు ఊపిరి బాగా పీల్చుకుని నెమ్మదిగా వదలండి.
- ఇన్విజిలేటర్ చెప్పే సూచనలు, సలహాలు తప్పక పాటించండి.
- ప్రశ్న పత్రం అందుకున్న తర్వాత:
- ప్రశ్నలన్నీ ఒకసారి పూర్తిగా చదవండి.
- తెలియని ప్రశ్నలు ఉంటే కంగారు పడొద్దు.
- ప్రశ్న పత్రం కఠినంగా ఉంటే ఆందోళన చెందొద్దు. అందరికీ అలానే ఉంటుంది.
- సమాధానాలను రాయేటప్పుడు:
- బాగా తెలిసిన ప్రశ్నలతో మొదలు పెట్టండి.
- ప్రశ్నకు అడిగిన సమాధానాన్ని సూటిగా రాయండి – అనవసరమైన విషయాలు రాయొద్దు.
- సమయం ఉంటేనే ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం రాయండి.
- మధ్యలో జవాబు మర్చిపోతే ఖాళీ వదిలి తర్వాత తిరిగి రాయండి.
- ఏ ప్రశ్నను వదలొద్దు – ఏదో కొంతైనా రాయండి.
- పరీక్ష ముగింపునకు 10 నిమిషాల ముందు:
- జవాబులు పూర్తయ్యాక, ఒక్కసారి సమీక్షించుకోండి.
- అన్ని ప్రశ్నలకు జవాబులు రాసామా? ప్రశ్న నంబర్లు సరిగానే వేశామా? చెక్ చేసుకోండి.
- హాల్ టికెట్ నెంబర్ సరిగా వేశారా లేదో మరోసారి చూసుకోండి.
- ఇన్విజిలేటర్ మీ జవాబు పత్రం తీసుకునే వరకు పరీక్ష హాల్లోనే ఉండండి.
విజయోస్తు!
దిగ్విజయోస్తు!
తరచుగా అడిగే ప్రశ్నలు
పరీక్ష రోజు ఉదయం ఎప్పుడు నిద్ర లేవాలి?
ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి, ఒక గంట పాటు తప్పక చదవండి. తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, ఉత్సాహాన్ని ఇచ్చే బట్టలు ధరించండి.
పరీక్ష రోజు అల్పాహారంగా ఏం తినాలి?
ఇడ్లీ, పొంగల్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. నూనెలో వేయించిన వడలు, బోండాలు, దోశ, పూరి వంటి వాటికి దూరంగా ఉండండి.
పరీక్షకు ఏ వస్తువులు సిద్ధం చేసుకోవాలి?
హాల్ టికెట్, ప్యాడ్, రెండు పెన్నులు, స్కేలు, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్, మంచినీటి బాటిల్, సరిపడినంత డబ్బులు ముందుగానే సిద్ధం చేసుకోండి.
పరీక్ష కేంద్రానికి ఎప్పుడు చేరుకోవాలి?
పరీక్ష కేంద్రానికి గం. 8:30 నాటికి చేరుకోండి; తొలి రోజు అయితే గంట ముందే వెళ్లండి. బయలుదేరే గంట ముందు చదవడం ఆపి ప్రశాంతంగా ఉండండి.
ప్రశ్న పత్రం కఠినంగా ఉంటే ఏం చేయాలి?
కంగారు, ఆందోళన చెందొద్దు; అందరికీ అలానే ఉంటుంది. బాగా తెలిసిన ప్రశ్నలతో మొదలుపెట్టి, ఏ ప్రశ్నను వదలకుండా ఏదో కొంతైనా రాయండి.
పరీక్ష ముగింపునకు 10 నిమిషాల ముందు ఏం చేయాలి?
జవాబులన్నీ ఒక్కసారి సమీక్షించుకోండి; ప్రశ్న నంబర్లు, హాల్ టికెట్ నెంబర్ సరిగా వేశారో చూసుకోండి. ఇన్విజిలేటర్ జవాబు పత్రం తీసుకునే వరకు హాల్లోనే ఉండండి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…
- సాధకుడు – సంసారం



