గాయత్రి మంత్రము గురించి మహాత్ములు చెప్పినవి...!!

🌷 వేదవ్యాస మహర్షి -🌿 "గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.
🌷 వేదవ్యాస మహర్షి -
🌿 "గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది."
శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో 'బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ' అని చెప్పబడింది.
🌷 విశ్వామిత్రుడు -
🌸 "బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు."
🌷 దేవీభాగవతము -
🌿 "గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది."
'తత్ సవితుర్వరేణ్యం భర్గః'
🌷 కూర్మపురాణము -
🌸 "ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు."
🌷 యాజ్ఞవల్క్యుడు -
🌿 "ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును."
🌷 ఆర్షసూక్తి -
🌸 "న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం."
🌷 భీష్మాచార్యులు -
🌿 "ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు."
🌷 అత్రి మహర్షి భవిష్య పురాణం -
🌸 "సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు."
🌷 లఘు అత్రి సంహితా -
🌿 "గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి."
🌷 పద్మపురాణం పరాశర మహర్షి -
🌸 "గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి."
🌷 అగ్నిపురాణం -
🌿 "ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు."
🌷 శంఖ స్మృతి -
🌸 "నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు."
🌷 సూత సంహితా యజ్ఞవైభవ ఖండం -
🌿 "అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు."
🌷 నారద మహర్షి -
🌸 "గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు, ఇందు సందేహము లేదు."
🌷 వశిష్ట మహర్షి -
🌿 "మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును. వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు."
🌷 మహాత్మాగాంధీ -
🌸 "నిత్యం గాయత్రిని జపించు వారికి ఆత్మోన్నతి మరియూ రోగనాశనం ఆపద నాశనం జరుగును."
🌷 ఆదిశంకరులు -
🌿 "గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు. ఇదియే ఆది మంత్రంము."
🌸 "అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది... స్వస్తి."




