ఆఫీసులో పని చేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించడం కొఱకు వచ్చింది. నేటి రోజుల్లో మహిళకు లోలోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులనూ, స్తోత్ర పఠనాదులనూ పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీలుగాలేదు అన్న తాపం ఆమెను దహించి వేస్తుoడేది.

పరమాచార్యుల మనసు కరిగే విధంగా ఈ విధంగా వేడుకొన్నది: “నేను పనికి వెళుతున్నాను. విరామ కాలం చాలా తక్కువగా వుంటున్నది. అంతేకాక మడి, ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి వీలుగావడం లేదు. పొడవైన స్తోత్రాలు, పారాయణాలు చేయడానికి వీలుపడటం లేదు. కానీ, యేదో ఒక సులభమైన మంత్రజపం చేయాలన్న తీవ్రమైన కోరిక వుంటున్నది. మీరు అనుగ్రహించాలి.”

ఇవి కూడా చదవండి: శ్రీ బిందుమాధవాష్టకం – శ్లోకాలు, అర్థం & భక్తి పఠనం · 🙏మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? · గాయత్రీ మంత్రం యొక్క ప్రాముఖ్యత మరియు అది ఎందుకు అంత శక్తివంతమైనది

వెంటనే కరుణామూర్తియైన పరమాచార్యులు, ఆ మహిళయొక్క అంతర్భావనను, చింతనను అర్థం చేసుకొని, “చెప్పు” అని అన్నారు.

Advertisement

“హరి నారాయణ దురిత నివారణ
పరమానంద సదాశివ శంకర”

ఉపదేశాన్ని పొందిన ఆ మహిళామణి, మనసులో సంతోషం ఉప్పొంగుతుండగా పరమాచార్యులకు నమస్కరించింది.

‘ఆచార అనుష్ఠానాలు లేని నీ వంటి దానికి మంత్రోపదేశ మెందుకు?’ అన్న కఠినమైన వాక్కులను యెదురుచూచి వచ్చిన ఆమె, అమూల్యమైన ఉపదేశంచే సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది.

కానీ, ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించినది కాదు; మనoదరికీ కూడా!

--- వైఖానస కరుప్పూర్ శ్రీనివాస అయ్యర్, కాంచీపురం.

తరచుగా అడిగే ప్రశ్నలు

పరమాచార్యులు ఉపదేశించిన సులభమైన మంత్రం ఏమిటి?

పరమాచార్యులు ఉపదేశించిన మంత్రం “హరి నారాయణ దురిత నివారణపరమానంద సదాశివ శంకర”. పొడవైన స్తోత్రాలు, పారాయణాలు చేయలేని వారికి కూడా ఇది సులభంగా జపించదగిన మంత్రం.

పరమాచార్యులు ఈ మంత్రాన్ని ఎవరికి ఉపదేశించారు?

ఆఫీసులో పని చేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించి సులభమైన మంత్రజపం కోసం వేడుకున్నప్పుడు ఆమెకు ఈ మంత్రాన్ని ఉపదేశించారు. అయితే ఈ మంత్రం ఆమెకు మాత్రమే కాదు, మనందరికీ కూడా అని చెప్పబడింది.

మడి, ఆచారం పాటించలేని ఉద్యోగస్తులు ఈ మంత్రం జపించవచ్చా?

విరామ కాలం తక్కువగా ఉందని, మడి, ఆచారం వంటి కఠిన నియమాలు పాటించలేనని చెప్పిన ఉద్యోగిని మహిళకే పరమాచార్యులు ఈ మంత్రాన్ని ఉపదేశించారు. కఠినంగా తిరస్కరిస్తారని భయపడిన ఆమె, ఉపదేశంతో సంపూర్ణ తృప్తిని పొందింది.

ఆ మహిళ పరమాచార్యులను ఏమని వేడుకుంది?

తాను పనికి వెళ్తున్నానని, పొడవైన స్తోత్రాలు, పారాయణాలు చేయడానికి వీలుపడటం లేదని, కానీ ఏదో ఒక సులభమైన మంత్రజపం చేయాలన్న తీవ్రమైన కోరిక ఉందని ఆమె వేడుకుంది. ఆమె అంతర్భావనను అర్థం చేసుకున్న పరమాచార్యులు వెంటనే మంత్రాన్ని ఉపదేశించారు.

పరమాచార్యుల మంత్రోపదేశం సంఘటనను ఎవరు పంచుకున్నారు?

ఈ సంఘటనను కాంచీపురానికి చెందిన వైఖానస కరుప్పూర్ శ్రీనివాస అయ్యర్ పంచుకున్నారు.