జై శ్రీమన్నారాయణ

భ్రమల వల్లే బాధలు ఈ లోకజీవితంపై మనం వేసుకున్న భ్రమలే మన బాధలకు మూలకారణం అని జగద్గురు ఆదిశంకరాచార్యులు అద్భుతంగా వివరించారు. ఇవి కూడా చదవండి: మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు: ఆపత్కాలంలో అన్నదానం · పురాతన భారతీయ అస్త్రాలు – శక్తి మరియు ధర్మానికి ప్రతీకలు · పిల్లల్లో ఆధ్యాత్మికత పెంపొందించే మార్గాలు | విలువలు, ధ్యానం, మంచి నడవడిక మనిషి శాశ్వతమని, ఈ జీవితం సుఖసారమని అనుకుని, ఆ మమకారంతో అనవసరంగా ఆస్తులు కూడబెట్టుకుని, ప్రణాళికలు వేసుకుని, పదులు వందల సంవత్సరాలు బతికిపోతామని మనసులో భ్రమలు పెంచుకుంటున్నాం.
భ్రమల వల్లే బాధలు
ఈ లోకజీవితంపై మనం వేసుకున్న భ్రమలే మన బాధలకు మూలకారణం అని జగద్గురు ఆదిశంకరాచార్యులు అద్భుతంగా వివరించారు.
ఇవి కూడా చదవండి: మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు: ఆపత్కాలంలో అన్నదానం · పురాతన భారతీయ అస్త్రాలు – శక్తి మరియు ధర్మానికి ప్రతీకలు · పిల్లల్లో ఆధ్యాత్మికత పెంపొందించే మార్గాలు | విలువలు, ధ్యానం, మంచి నడవడిక
మనిషి శాశ్వతమని, ఈ జీవితం సుఖసారమని అనుకుని, ఆ మమకారంతో అనవసరంగా ఆస్తులు కూడబెట్టుకుని, ప్రణాళికలు వేసుకుని, పదులు వందల సంవత్సరాలు బతికిపోతామని మనసులో భ్రమలు పెంచుకుంటున్నాం. కానీ నిజం ఏమిటంటే… మన జీవితం తామరాకుపై నీటిబిందువులా చంచలమైనది. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అయినా, దేహాభిమానాన్ని విడువలేక మనం బాధలలో చిక్కుకుపోతున్నాం.
శంకరాచార్యులు చెబుతున్నది నిరాశ కలిగించేందుకే కాదు… ఈ జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో చెప్పే హెచ్చరిక మాత్రమే.
ఏ సుఖమైనా శాశ్వతం కాదు… ఏ కష్టమైనా నిరంతరం ఉండదు. ఇది మనసులో బలంగా నిలిపితే ఎలాంటి పరిస్థితులనైనా మనం అధిగమించగలం. అందుకే శ్రీరామకృష్ణ పరమహంసులు కూడా చెబుతారు —
“మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి” అని.
ఈ లోకంలోకి మనం యాత్రికుల్లా వచ్చాం… కొన్ని కర్మలు చేయడానికి మాత్రమే. కానీ తప్పుడు మమకారంతో ఆస్తుల పట్ల యజమానుల్లా ప్రవర్తించటం, వాటిని శాశ్వతమని భావించటం మన గొప్ప తప్పు. మనకున్న బంధువులు, స్నేహితులు, ఇళ్లు… ఇవన్నీ కేవలం ఈ జీవనయాత్రలో తాత్కాలికమైనవి మాత్రమే.
తామరాకు నీటిలో తేలినట్టు జీవితం వృద్ధిలో ఉండాలి — సంబంధాల్లో, బాధ్యతల్లో, కానీ వాటికి బందీ కాకుండా, లోలోపల స్వతంత్రంగా.
ఈ కాలంలో మనం లేకపోతే ఈ లోకం ఆగిపోతుందనే భావనతో అహంకారంలో మునిగిపోతున్నాం. కానీ వాస్తవంగా మనం లేకున్నా జీవితం ముందుకే సాగుతుంది. ఇది తెలుసుకుంటే అహంకారం తగ్గిపోతుంది.
బహుశా కొందరు అనుకోవచ్చు — “ఈ జీవితాన్ని ఆస్వాదిద్దాం, సుఖపడుదాం” అని. కానీ ఈ భౌతిక సుఖాల తాపత్రయం ఎన్నడూ తీరదు… ఎంత తీర్చుకున్నా ఇంకా కావాలనిపిస్తుంది. కోరికలను తీరుస్తూ వాటిని ఆర్పాలని భావించడం, నెయ్యితో నిప్పు ఆర్పాలనుకోవడంలాంటిదే.
మన జీవితంలో ఒక్కోసారి వైరాగ్య భావన రావచ్చు… కానీ అది స్మశాన వైరాగ్యం లాగే కాసేపే ఉంటుంది. తరువాత మళ్లీ మామూలే.
ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే —
మనం భ్రమల నుంచి, దుఃఖాల నుంచి విముక్తి పొందగలం.
మనమూ, ఈ లోకమూ, ఈ సంబంధాలూ తాత్కాలికమే అని తెలుసుకోవడం ద్వారా మనం జీవితాన్ని సార్ధకం చేసుకోవచ్చు.
అదే జీవితం యొక్క అసలు సత్యం!
తరచుగా అడిగే ప్రశ్నలు
ఆదిశంకరాచార్యుల ప్రకారం మన బాధలకు మూలకారణం ఏమిటి?
లోకజీవితంపై మనం పెంచుకునే భ్రమలే బాధలకు మూలకారణం అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వివరించారు. జీవితం శాశ్వతమని భావించి ఆస్తులపై మమకారం, దేహాభిమానం పెంచుకోవడం వల్ల బాధల్లో చిక్కుకుంటాం.
జీవితాన్ని తామరాకుపై నీటిబిందువుతో ఎందుకు పోలుస్తారు?
తామరాకుపై నీటిబిందువులా మన జీవితం చంచలమైనది, ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. తామరాకు నీటిలో తేలినట్టు సంబంధాల్లో, బాధ్యతల్లో ఉంటూనే వాటికి బందీ కాకుండా లోలోపల స్వతంత్రంగా ఉండాలి.
కోరికలను తీర్చుకుంటూ వాటిని ఆర్పగలమా?
లేదు. భౌతిక సుఖాల తాపత్రయం ఎంత తీర్చుకున్నా ఇంకా కావాలనిపిస్తుంది. కోరికలను తీరుస్తూ ఆర్పాలనుకోవడం నెయ్యితో నిప్పు ఆర్పాలనుకోవడం లాంటిదే.
స్మశాన వైరాగ్యం అంటే ఏమిటి?
జీవితంలో ఒక్కోసారి కలిగే వైరాగ్య భావన కాసేపే ఉండి, తరువాత మళ్లీ మామూలు స్థితికి వచ్చేయడమే స్మశాన వైరాగ్యం.
శ్రీరామకృష్ణ పరమహంసులు మరణం గురించి ఏమి చెప్పారు?
“మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి” అని శ్రీరామకృష్ణ పరమహంసులు చెప్పారు. ఏ సుఖమూ శాశ్వతం కాదు, ఏ కష్టమూ నిరంతరం ఉండదని మనసులో నిలిపితే ఏ పరిస్థితినైనా అధిగమించగలం.
అహంకారాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
మనం లేకపోతే లోకం ఆగిపోతుందనే భావనే అహంకారానికి కారణం. మనం లేకున్నా జీవితం ముందుకే సాగుతుందని తెలుసుకుంటే అహంకారం తగ్గిపోతుంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- శ్రీ సద్గురు పీఠం తరపున దీపావళి శుభాకాంక్షలు – స్వాతి నక్షత్ర యుక్త ఆశ్వయుజ అమావాస్య
- భక్తికి మూలం హృదయ పరివర్తన – శ్రీ సద్గురు పీఠం
- భగవంతుని పొందే మార్గం: పంచవిధ భక్తి భావాలు – శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావం
- శుభకార్యాల్లో భోజనాలు ఎందుకు పెడతారు? అన్నదానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
- ప్రేమకు, అనుబంధానికి తేడా ఏమిటి? వేదాంతం చెప్పే నిస్వార్థ ప్రేమ, విశ్వప్రేమ




