చాలా మంది పురోహితులు నెలకు రూ 50000 నుండి లక్ష లక్షన్నరకు పైగా సంపాదించే వాళ్లు వున్నారు సాధారణం గా మధ్యాహ్నం సాయంకాలం ఇంట్లో నె వుంటారు

పెళ్ళవడం లేదనే టెన్షన్ చాలా ఎక్కువగా వున్నవాళ్లు పురోహితులే పెళ్ళిచేసుకుంటే ఎక్కువసమయం భార్యాభర్తలు కలసి వుండే అవకాశం వుంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు

కొంతమంది పౌరోహిత్యాన్ని పార్ట్ టైమ్ జాబ్ గా కూడా చేస్తున్నారు సంవత్సరం లో ఒక్కొక్కసారి కొన్ని నెలలు ఇంట్లో వుండే అవకాశం ఉండి భార్యాభర్త మధ్య ప్రేమ అనురాగం పెంపొందించుకునే అవకాశం వుంటుంది. పురోహితులకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ వుంది

పురోహితులను చిన్న చూపు చూడటం తప్పు వారు కూడా బాగా సంపాదిస్తూ సంఘంలో గౌరవం గా బ్రతుకుతున్నారు. పురోహితులు బాగా సంపాదిస్తున్నా సొంతిల్లు ఉన్నా కేవలం పౌరోహిత్యం వృత్తిగా చేపట్టడం అమ్మాయిలకు వాళ్ళతల్లితండ్రులకు నచ్చక పోవడంతో వాళ్లకు పెళ్లిళ్లు అవక బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు ఇది ఏమంత మంచి పరిణామం కాదు.

వివాహాలు జరిపించే పురోహితులకే పెళ్లి జరగటం లేదంటే ఎంత బాధ. నిజంగా పురోహితులు వారి భార్యను మిగతా ఉద్యోగస్థులకంటే బాగా చూసుకుంటారు ఇది తెలుసుకుని పురోహితులను వివాహం చేసుకునే దశగా అడుగులు వెయ్యండి
బి మల్లికార్జున దీక్షిత్
ప్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్ 9133320425