నేడు పెళ్లి — ఒక సమస్యగా మారిపోయిందా?

పిల్లలకు పెళ్లి చేయాలనేదే తల్లితండ్రుల కోరిక.
పిల్లలకు పెళ్లి చేయాలనేదే తల్లితండ్రుల కోరిక.
కానీ పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకును వెతుకుతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు అంతులేనివి!
మన అమ్మాయి అత్తవారింట్లో ఎలా ఉంటుందో?
అక్కడ అత్త, మామలు ఉంటారా? లేదా వాళ్లు ఎలా ఉంటారు?
మన అమ్మాయిని గౌరవిస్తారా? రాచి రంపాన పెడతారా?
అలాంటి అనుమానాలు తల్లిదండ్రుల మనసుల్లో అనివార్యం.
నేటి కాలంలో —
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం,
ఉద్యోగం వల్ల నగరాల్లో చిన్నచిన్న అద్దె ఇళ్ళలో వేరుగా జీవించడం,
ట్రాఫిక్, ఒత్తిడి కారణంగా — కొత్త జంటలు తమకంటూ జీవితం ప్రారంభించడం
ఇవి వాస్తవాలు.
అప్పుడు ప్రశ్న ఏమిటంటే —
నేటి యువత చదువులు, జీతాలు ఎంత ఉన్నా…
సంస్కారం విషయంలో మాత్రం మునుపటి తరం పెద్దల పాదాలను పట్టవలసిందే.
పెళ్లికొడుకు విషయంలో తల్లితండ్రుల ఆలోచన —
బాగా సంపాదించాలి, మంచి ఆస్తి ఉండాలి,
తన భార్యను ప్రేమించాలి, కావాల్సినవి కొనిపెట్టాలి,
మందు, సిగరెట్ అలవాట్లు లేకూడదు,
కారు ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉండాలి,
ఆఫీసు పనయిన తర్వాత ఇంటికొచ్చి భార్యతోనే గడపాలి!
అదే తల్లితండ్రులకు ఓ సందేశం —
మీ పిల్లలు పెద్దయ్యారు, చదువుకున్నారు.
పెళ్లయ్యాక వారే కలిసి నిర్ణయాలు తీసుకుంటారు.
మీరు అడిగితేనే సలహా ఇవ్వండి.
ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండి.
వారి జీవితం మీద అదుపు చూపకండి.
కొడుకు తల్లిదండ్రులు —
మీ కోడలిని వంట రాదా అని విమర్శించకండి.
రాకపోతే నేర్చుకుంటుంది.
వంటమనిషిని పెట్టుకోండి, లేదా మీరు వండండి.
కాబోయే కోడలికి —
రోజూ పూజ చేయాలి, పాదున్నే లేవాలి, మడి పాటించాలి —
ఇలా చెబితే సంబంధాలు చెడిపోతాయి.
నేటి తరం చదువులతోనే బిజీ అయిపోతున్నారు.
అవన్నీ నేర్చుకునే సమయం వారికి ఇవ్వండి.
అంతేకాదు —
కొంతమంది తల్లితండ్రులు సంబంధాలు వచ్చినా పట్టించుకోవడం లేదు.
వయస్సు మించిపోయాక పెళ్లి గురించి ఆలోచించడం వల్ల —
పిల్లలు మనకు తెలియకుండా ప్రేమించుకుని పారిపోతున్నారు.
50 ఏళ్ల క్రితం పెళ్లిళ్లు —
ఐదు రోజులపాటు, ఆనందంగా, ప్రేమాభిమానాలతో, పెద్దల ఆశీర్వాదాలతో జరిగేవి.
పెళ్లిళ్లు బంధాలను మరింత బలపర్చేవి.
ఇప్పుడు…
లేనిపోని ఆలోచనలు చేసి, పిల్లల పెళ్లిని వాయిదా వేయడం తల్లితండ్రులకు హక్కు లేదు.
పుట్టిన ప్రతి బిడ్డకు పెళ్లి చేయడం తల్లితండ్రుల బాధ్యత.
తల్లితండ్రులకు ఓ మనవి —
మీరు తప్పనిసరిగా పిల్లల శ్రేయస్సు కోరాలి —
కానీ వాటి కోసం వారి జీవితాల్లోకి అవసరమైనంత వరకు మాత్రమే జోక్యం చేసుకోవాలి.
బి మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 9133320425
తరచుగా అడిగే ప్రశ్నలు
పెళ్లి సంబంధం వెతికేటప్పుడు తల్లితండ్రులకు ఎలాంటి అనుమానాలు వస్తాయి?
అమ్మాయి అత్తవారింట్లో ఎలా ఉంటుంది, అత్త మామలు ఉంటారా, ఆమెను గౌరవిస్తారా లేదా రాచి రంపాన పెడతారా అనే అనుమానాలు తల్లిదండ్రుల మనసుల్లో అనివార్యం.
పెళ్లికొడుకు విషయంలో తల్లితండ్రులు ఏం ఆశిస్తున్నారు?
బాగా సంపాదించాలి, మంచి ఆస్తి, కారు, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉండాలి, మందు, సిగరెట్ అలవాట్లు ఉండకూడదు. ఆఫీసు పని తర్వాత ఇంటికొచ్చి భార్యతోనే గడపాలని కూడా కోరుకుంటున్నారు.
పెళ్లయ్యాక పిల్లల జీవితంలో తల్లితండ్రులు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి?
పెళ్లయ్యాక నిర్ణయాలు జంటే కలిసి తీసుకుంటారు, కాబట్టి అడిగితేనే సలహా ఇవ్వాలి. ప్రతి విషయంలో జోక్యం చేసుకోకుండా, అవసరమైనంత వరకు మాత్రమే జోక్యం చేసుకోవాలి.
కొత్త కోడలి విషయంలో అత్తమామలు ఏం చేయకూడదు?
వంట రాదని విమర్శించకూడదు; రాకపోతే నేర్చుకుంటుంది, లేదా వంటమనిషిని పెట్టుకోవచ్చు. రోజూ పూజ, పొద్దున్నే లేవడం, మడి వంటివి బలవంతం చేస్తే సంబంధాలు చెడిపోతాయి; నేర్చుకునే సమయం ఇవ్వాలి.
పిల్లల పెళ్లి వాయిదా వేస్తే ఏమవుతుంది?
వయస్సు మించిపోయాక పెళ్లి గురించి ఆలోచించడం వల్ల పిల్లలు తెలియకుండా ప్రేమించుకుని పారిపోతున్న సందర్భాలు ఉన్నాయి. పుట్టిన ప్రతి బిడ్డకు పెళ్లి చేయడం తల్లితండ్రుల బాధ్యత.
50 ఏళ్ల క్రితం పెళ్లిళ్లు ఎలా జరిగేవి?
ఐదు రోజులపాటు ఆనందంగా, ప్రేమాభిమానాలతో, పెద్దల ఆశీర్వాదాలతో జరిగేవి. ఆ పెళ్లిళ్లు బంధాలను మరింత బలపర్చేవి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సంప్రదాయాలు నుంచి మరిన్ని
- షష్టిపూర్తి: హిందూ సంప్రదాయంలో 60వ పుట్టినరోజు వేడుక – విధులు, సామగ్రి, క్రమబద్ధమైన విధానం
- కర్వా చౌత్ వెనుక చరిత్ర, పురాణ కథలు: వీరవతి, కర్వా, ద్రౌపది మరియు 2026 వ్రతం (గురువారం, 29 అక్టోబర్)
- రామ్లీలా: భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి సజీవ పునఃకథనం
- భీష్మ తర్పణ విధి
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం




