పిల్లల చెడు పెరుగుదలకు 90% కారణం తల్లిదండ్రులే

పిల్లలను గారాబంగా పెంచితే, అంతా నష్టమే. మన అసమంజసమైన అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అధిక ప్రేమే వారిని బద్ధకస్తులుగా మారుస్తుంది.
పిల్లలను గారాబంగా పెంచితే, అంతా నష్టమే.
మన అసమంజసమైన అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అధిక ప్రేమే వారిని బద్ధకస్తులుగా మారుస్తుంది. వాస్తవానికి వాళ్ళను నాశనం చేస్తోంది.
ఇప్పటి తరం:
- 70% పిల్లలు తల్లిదండ్రుల కార్లు, బండీలు కడవడాన్ని కూడా ఇష్టపడరు.
- మంచి నీళ్ళ కోసం బయటికి పంపితే వెళ్ళరు.
- లంచ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ శుభ్రం చేయడం మర్చిపోతారు.
- ఇంటి చిన్న సహాయక పనులు చేయడంలో ఆసక్తి చూపరు.
- రాత్రి 10 గంటలకు పడుకోమని, ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు లేచేయమని చెప్పినా వినరు.
- గట్టిగా మాట్లాడితే తిరిగి కొట్టుకుంటారు.
- తిడితే వస్తువులను విసిరి కొడతారు.
- డబ్బులు ఇస్తే ఐస్ క్రీమ్, నూడుల్స్, పార్టీలు, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌లు కొనుగోలు చేస్తున్నారు.
- ఆడపిల్లలు తినిన కంచం కూడా కడగడం ఇష్టం లేదు.
- ఇల్లు శుభ్రం చేయమంటే కోపం చూపుతారు.
- అతి తక్కువ మందికే వంట cooking రావడం.
- బట్టలు, వ్యక్తిగత శ్రద్ధ విషయంలో నిర్లక్ష్యం.
ఈ వింతపోకడలకు కారణం ఏమిటంటే… మన తల్లిదండ్రుల అహంకారం, పరువు, ప్రతిష్టల భారం.
మనం కష్టపెట్టాలని కాదు, కష్టం ఏదో తెలుసుకునేలా పిల్లలను పెంచాలి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ లేదు.
ప్రేమగా, గారాబంగా మనం చేసే తప్పులే వారిని దారితప్పిస్తున్నాయి.
15 ఏళ్ళకే సిగరెట్, మద్యపానం, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్, హత్యలు గల యువత ఈ కారణంగానే.
అభినయం, ఆత్మవిశ్వాసం కనిపించకపోవడం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం… ఇదే మన భవిష్యత్తు.
ఇలా కొనసాగితే, తల్లిదండ్రులను గౌరవించే పరంపర కూడా పాడు అవుతుంది.
భార్యకు వంట cooking రాకపోవడం, చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
అలాగే, పెరుగుతున్న కాలేజీ పిల్లలు సరైన ఆహారం తినడం మర్చిపోతున్నారు; ఫలాలు, ఆరోగ్యకరమైన ఆహారం దూరం.
100 మందిలో 90 మందికి సిజేరియన్ ప deliveries – శారీరక పటుత్వం తక్కువగా ఉందని సూచిస్తుంది.
పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, చిన్న వయసులోనే సోడాబుడ్డిలాంటి కళ్ళద్దాలు, అల్సర్, బీపీ వంటి వ్యాధులు పెరుగుతుంటే… కారణం మనే!
అందుకే తల్లిదండ్రులు మారాలి.
రేపటి సమాజానికి మనం ఏమి నేర్పిస్తున్నాం?
సాంప్రదాయం అంటే…
- గుడికి వెళ్లి పూజలు చేయడమే కాదు
- బాధ్యత, మర్యాద, గౌరవం
- కష్టం, నష్టం, ఓర్పు, సహనం
- దాతృత్వం, ప్రేమ, అనురాగం
- సహాయం, సహకారం, నాయకత్వం
- మానసిక దృఢత్వం
- కుటుంబ బంధాలు, అనుబంధాలు
- దైవ భక్తి, దేశ భక్తి
ఈ విలువలను చిన్న వయసులోనే పిల్లల్లో నాటాలి.
కొంత కష్టమయినా సరే, ఈ సాంప్రదాయాలు పిల్లలకు అలవాటు కావాలి.




